Begin typing your search above and press return to search.

యువ‌హీరోకి భార్య‌గా న‌య‌న‌తార‌కు ఓకేనా?

By:  Tupaki Desk   |   20 Aug 2021 11:09 AM IST
యువ‌హీరోకి భార్య‌గా న‌య‌న‌తార‌కు ఓకేనా?
X
టాలీవుడ్ లో అగ్ర హీరోల స‌రస‌న క‌థానాయికగా న‌టించారు న‌య‌న‌తార‌. సీనియ‌ర్ న‌టీమ‌ణిగా ర‌జ‌నీకాంత్-చిరంజీవి-బాల‌కృష్ణ‌- వెంక‌టేష్- నాగార్జున వంటి సీనియ‌ర్ల‌ స‌ర‌స‌న న‌టించిన న‌య‌న్ చాలా అరుదుగా యువ‌హీరోల‌కు ఓకే చెబుతున్న సంగ‌తి తెలిసిందే.

ఆస‌క్తిక‌రంగా మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టించిన న‌య‌న్ .. మ‌రోసారి చిరుతో సినిమాకి అంగీక‌రించారు. కానీ ఈసారి ఇందులో విల‌న్ గా న‌టిస్తున్న స‌త్య‌దేవ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించేందుకు అంగీక‌రించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. స‌త్య‌దేవ్ ఇప్పుడిప్పుడే కెరీర్ ప‌రంగా స్థిర‌ప‌డుతున్న న‌టుడు. అయినా అత‌డి స‌ర‌స‌న న‌టించేందుకు న‌య‌న్ అంగీక‌రించ‌డం ఆస‌క్తిక‌రం.

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయకుడిగా స‌త్య‌దేవ్ విల‌న్ గా న‌టిస్తున్న లూసీఫ‌ర్ రీమేక్ లో న‌య‌న్ అధికారికంగా ఖాయ‌మైంది. ఇక ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో వివేక్ ఒబేరాయ్ పోషించిన విల‌న్ పాత్ర‌లో స‌త్య‌దేవ్ న‌టిస్తుండడం ఉత్కంఠ పెంచుతోంది. ఇందులో చిరంజీవి సోదరిగా న‌య‌న‌తార క‌నిపిస్తారు. కుటిల రాజ‌కీయ నీతి క‌లిగిన వాడిగా స‌త్య‌దేవ్ న‌టించ‌నున్నారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాతృక‌లో పృథ్వీరాజ్ పోషించిన మెరుపులాంటి పాత్ర‌లో స‌ల్మాన్ మెరవ‌నున్నారు. ఈ సినిమాకి గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. మోహన్ రాజా దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఎన్వీ ప్ర‌సాద్ -చ‌ర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.