Begin typing your search above and press return to search.

రాణి వేలు పాత్రలో నయన్‌ నటించడం లేదట

By:  Tupaki Desk   |   30 Dec 2020 6:15 PM IST
రాణి వేలు పాత్రలో నయన్‌ నటించడం లేదట
X
తమిళం మరియు తెలుగులో వరుసగా భారీ ప్రాజెక్ట్‌ లు చేస్తున్న నయనతార లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ పిలిపించుకుంటుంది. వరుసగా ఈమె తమిళంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల ఈమె తమిళ వీర నారి రాణీ వేలు నచియార్‌ బయోపిక్‌ లో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ప్రజలు ఎంతో గౌరవించే ఆమె పాత్రలో నయన్‌ నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు వైరల్‌ అవుతుండటంతో అభిమానులు రకరకాలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో ఆమె టీం వార్తలపై స్పందించింది. రాణీ వేలు నచియార్ బయోపిక్ లో నయనతార నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. ఆమె వద్దకు అలాంటి ప్రాజెక్ట్ ఏమీ రాలేదు. అసలు అలాంటి పీరియాడిక్‌ మూవీస్ కూడా ఏమీ నయన్‌ చేయడం లేదని ప్రెస్‌ నోట్‌ లో పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని ఏదైనా సినిమా ఉంటే ఆమె నుండి స్వయంగా ప్రకటన వస్తుందని పుకార్లను నమ్మవద్దంటూ ఆమె టీం పేర్కొంది. ప్రస్తుతం రజినీకాంత్‌ అన్నాత్తే సినిమాలో నయన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.