Begin typing your search above and press return to search.

మెగా 'లూసీఫర్‌' లో నయన్ పాత్రపై మరింత స్పష్టత

By:  Tupaki Desk   |   19 Aug 2021 2:00 PM IST
మెగా లూసీఫర్‌ లో నయన్ పాత్రపై మరింత స్పష్టత
X
మెగా స్టార్‌ చిరంజీవి మలయాళ సూపర్‌ హిట్ మూవీ 'లూసీఫర్‌' ను రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. చాలా నెలలుగా అనుకుంటున్న ఈ సినిమాను ఇటీవలే పట్టాలెక్కించారు. తమిళ దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వడంతో పాటు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మెల్ల మెల్లగా రివీల్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో నటించబోతున్నది ఎవరు అనే విషయమై గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సీనియర్ హీరోయిన్స్ నుండి పలువురి పేర్లు వినిపించాయి. ఇతర భాషల హీరోయిన్స్ కూడా పరిశీలించబడ్డారు. చివరకు ఈ సినిమాలో ఆ కీలకమైన పవర్ ఫుల్‌ రోల్‌ ను నయనతారతో చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఒరిజినల్‌ వర్షన్‌ లూసీఫర్ లో వివేక్ ఒబేరాయ్ చేసిన పాత్రను తెలుగు రీమేక్ లో యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ నటుడు సత్యదేవ్‌ చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో మంజు వారియర్ ను వివేక్ ఒబేరాయ్ గా చూపించడం జరిగింది. ఇక మెగా రీమేక్ లో మంచు వారియర్ పాత్రలో నయనతార నటించబోతుంది. అంటే సత్యదేవ్ కు ఆమె భార్యగా కనిపించబోతుంది. స్టైలిష్‌ విలన్ లుక్‌ లో సత్యదేవ్‌ కనిపించబోతున్నాడు. భార్య అమాయకత్వంను ఆసరాగా చేసుకుని సత్యదేవ్‌ భారీగా అవినీతికి పాల్పడటంతో పాటు అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు. సినిమాలో వీరిద్దరి కాంబో సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. నయన్‌ మరియు సత్యదేవ్‌ ల కాంబో సన్నివేశాలు కూడా తప్పకుండా బాగుంటాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

మెగాస్టార్‌ చిరంజీవి ఏరికోరి మరీ వివేక్‌ ఒబేరాయ్ పోషించిన పాత్రకు గాను సత్యదేవ్‌ ను ఎంపిక చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో కీలకమైన గెస్ట్‌ రోల్‌ ను బాలీవుడ్ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఇక లూసీఫర్ తెలుగు రీమేక్‌ కు సంబంధించిన కీలక అప్‌డేట్ ను చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒరిజినల్‌ వర్షన్ కు పలు మార్పులు చేర్పులు చేసిన మోహన రాజా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది. సినిమా విడుదల వచ్చే ఏడాదిలో ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.