Begin typing your search above and press return to search.

భర్త కోసం మరో బంగ్లా కొనేసిన నయన్

By:  Tupaki Desk   |   5 July 2022 9:30 AM GMT
భర్త కోసం మరో బంగ్లా కొనేసిన నయన్
X
లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నయనతార ఇటీవల డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రెండుసార్లు ప్రేమలో తీవ్రస్థాయిలో విఫలమైనప్పటికీ కూడా నయనతార తన సినిమా కెరిర్ పై ఏమాత్రం ప్రభావం చూపకుండా ధైర్యంగా ముందుకు కొనసాగింది. ఇతర స్టార్ హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు కానీ గత 15 నెలలుగా ఆమె మాత్రం ఇండస్ట్రీలో చాలా బిజీ హీరోయిన్ గా కనిపిస్తూనే ఉంది.

పర్సనల్ లైఫ్ ను అలాగే సినిమా కెరిర్ పై ప్రభావం చూపించకుండా చాలా జాగ్రత్తగా నయన్ అడుగులు వేసింది అని చెప్పాలి. అయితే ఇటీవల ఆమె తన విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆమె ప్రత్యేకంగా ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసింది.

ఇదివరకే నయనతార చెన్నైలోని ఒక కాస్ట్లి ఏరియాలో ప్రత్యేకమైన బంగ్లాను కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు ఆమె తన భర్తతో ప్రత్యేకంగా ఉండాలి అని చెన్నై పోయెస్‌గార్డెన్‌లో ఏకంగా రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

8 వేల చదరపు అడుగుల స్థలంలో ఆమె ఇప్పుడు ఒక బంగ్లాను మళ్లీ రీ మోడలింగ్ చేయిస్తున్నట్లు సమాచారం. అందులో ఇంటీరియర్ డిజైన్ కోసమే దాదాపు 25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా టాక్. పూర్తిగా ఇంటినీ తన భర్త పేరు పైనే కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

పోయెస్‌గార్డెన్‌లో ఎక్కువగా సెలబ్రిటీలు ఉంటారు అందులోనే రజినీకాంత్ జయలలిత శశికళ అలాగే మరి కొంతమంది రాజకీయ ప్రముఖులు ఖరీదైన బంగ్లాకు కూడా ఉన్నాయి.

ఇక ఇప్పుడు నయనతార ప్రత్యేకంగా తన దాంపత్య జీవితం కోసం ఖరీదైన ఇంటిని నిర్మించుకుంటుంది. అందులోనే ప్రత్యేకంగా జిమ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉండే విధంగా డిజైన్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇంకా గృహప్రవేశం జరగలేదట. త్వరలోనే తన భర్తతో కలిసి నయనతార అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.