Begin typing your search above and press return to search.

పెయిన్ లేకపోతే స్పెయిన్ ట్రిప్ ఉండదు!

By:  Tupaki Desk   |   18 Aug 2022 4:49 AM GMT
పెయిన్ లేకపోతే స్పెయిన్ ట్రిప్ ఉండదు!
X
రొమాంటిక్ క‌పుల్ న‌య‌న్ - విఘ్నేష్ జంట విదేశీ విహారం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ప్యారిస్ ట్రిప్ లో క‌పుల్ క‌ల‌ర్ ఫుల్ రొమాంటిక్ మూడ్ అన్ లిమిటెడ్ గా కంటిన్యూ అవుతోంది. కొత్తగా పెళ్లయిన జంట తీపి అనుభ‌వాల‌ను త‌మ సొంతం చేసుకుంటోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార త‌న‌ భర్త విఘ్నేష్ శివన్ కు ఇది రెండో హ‌నీమూన్ ట్రిప్.

తాజాగా ఈ జంట బార్సిలోనా (యూర‌ప్) వీధుల్లో విహ‌రించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. న‌య‌న్ తాళి బొట్టును ఎలివేట్ చేసే కొన్ని ఫోటోలు ఇంత‌కుముందు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చాయి. కానీ ఈసారి న‌య‌న్ తో అలా రొమాంటిగ్గా షికార్ చేస్తున్న ఓ ఫోటో వైర‌ల్ గా మారింది. న‌య‌న్ పొట్టి గౌనులో సిండ్రెల్లా లుక్ లో క‌నిపించింది.

విఘ్నేష్ సింపుల్ లుక్ తో క‌నిపించాడు. ఇక యాత్ర గురించి విఘ్నేష్ మాట్లాడుతూ-''పెయిన్ లేకపోతే తమకు స్పెయిన్ ట్రిప్ ఉండదు'' అని క్రిప్టిక్ గా వ్యాఖ్యానించారు. నొప్పిని భరిస్తూనే కష్టపడి పనిచేయండి. ఆపై స్పెయిన్ పర్యటనను ప్రారంభించండి. ఆపై తిరిగి వచ్చి దాన్ని పునరావృతం చేయండి'' అని కొన్ని ఫోటోల‌ను షేర్ చేసారు.

క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాం. నిరంతర పని తర్వాత ఈ ఖాళీ చాలా అవసరం అనిపించింది! చాలా కాలం తర్వాత వేరే దేశానికి వెళ్లడం చాలా భిన్నంగా అనిపిస్తుంది !! ఇది గరిష్టంగా రిఫ్రెష్ అవ్వ‌డానికి పునరుజ్జీవనానికి ఉప‌క‌రిస్తుంది! ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడం... ఆహార సేవ‌నం.. సంగీతం వినడం కోసం మాత్రమే నా డబ్బులో పెద్ద మొత్తాన్ని ఆదా చేస్తున్నాను! అని విఘ్నేష్ తెలిపాడు.

బార్సిలోనాలో బీచ్ విహారాలు వీధుల్లో విహారం ముగించి విశ్రాంతి తీసుకోవడానికి ఈ జోడీ వాలెన్సియాకు వెళ్లారు. వాలెన్సియాకు వెళ్లే మార్గంలో రైలులో కిటికీ సీటు దగ్గర నయనతార స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ని కూడా విగ్నేష్ షేర్ చేశారు.

త‌మ రొమాంటిక్ విహార యాత్ర నుంచి ఏ ఒక్క ఆస‌క్తిక‌ర విష‌యాన్ని కూడా ఈ జంట దాచుకోవ‌డం లేదు. త‌మ మూడ్స్ అన్నిటినీ ఓపెన్ గానే ప్ర‌ద‌ర్శిస్తున్నారు.