Begin typing your search above and press return to search.

న‌య‌న్ -విఘ్నేష్ జంట పెళ్లి ఎప్ప‌టికీ మిస్ట‌రీనే!

By:  Tupaki Desk   |   14 March 2022 9:30 AM GMT
న‌య‌న్ -విఘ్నేష్ జంట పెళ్లి ఎప్ప‌టికీ మిస్ట‌రీనే!
X
విఘ్నేష్ శివ‌న్-న‌య‌న‌తార ప్రేమ వ్య‌వ‌హారం చాలా కాలంగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇద్ద‌రు స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌న్న‌ది అధికారికం. కానీ పెళ్లి విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త రాలేదు. ఈ జంట‌కి ఇప్ప‌టికే పెళ్లి అయిపోయింద‌ని..లాక్ డౌన్ స‌మ‌యంలో ర‌హ‌స్యంగా వివాహ బంధంతో ఒక‌ట‌య్యారని కోలీవుడ్ మీడియాలో చాలాసార్లు క‌థ‌నాలు వ వెలువ‌డ్డాయి. పెళ్లికి గ‌ల అడ్డంకుల‌ను తొల‌గించుకునేందుకు హిందుధ‌ర్మ‌శాస్ర్త ప్ర‌కారం గుడులు గోపురాలు తిరిగి దశ‌ల వారీగా దోషాలు తొల‌గించుకున్నార‌ని..ఈ క్ర‌మంలోనే కొన్ని ఫోటోలు సైతం నెట్టింట వైర‌ల్ గా మారాయి.

అలాగే దోష నివార‌ణ‌లో భాగంగా న‌య‌న‌తార ముందుగా ఓ చెట్టుని సైతం వివాహం చేసుకున్న‌ట్లు..దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా మీడియాలో సంచ‌ల‌నం రేపాయి. అయితే తాజాగా ఈ జంట ఓ గుడిలో ప్ర‌త్య‌క్ష‌మైంది. నయనతార గుడిలో నుదుటున బొట్టుతో కనిపించారు.

దాంతో ఈ జంట ఇప్పటికే పెళ్లిచేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజ ముగించుకొని బయటికి వచ్చిన నయన్.. నుదుటిన కుంకుమతో దర్శనమిచ్చారు. దీంతో కొందరు ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.

ఇలాంటి సంద‌ర్భాలు ఈ జంట‌కు కొత్తేం కాదు. గ‌తంలో ఇలాంటి స‌న్నివేశాలు చాలాసార్లు రిపీట్ అయ్యాయి. అయితే అధికారికంగా మీడియాకి తెలియ‌క‌పోవ‌డంతో పెళ్లి విష‌యంలో ఇంకా మిస్ట‌రీగానే ఉంది. ఈ జంట పెళ్లి చేసుకుందా? లేదా? అన్న‌ది ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ద‌ర్శ‌నానికి గుడికి వెళ్లిన‌ప్పుడు కుంకుమ బొట్టు ఎవ‌రైనా పెట్టుకుంటారు. అంత మాత్రాన న‌య‌న్ నుదిటిన కుంకుమ బొట్టు తో క‌నిపించినంత మాత్రన పెళ్లిపోయింద‌ని భావించ‌డం క‌రెక్టేనా? అన్న‌ది సందేహ‌మే.

అయితే ఇంకొంత మంది పెళ్లి ఇప్ప‌టికే జ‌రిగిపోయింద‌ని కానీ ప‌బ్లిక్ చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంది? అదంతా వాళ్ల వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హ‌రం. చెప్పాలా? లేదా? అన్న‌ది ఆ జంట నిర్ణ‌యం మీద ఆధార‌ప‌డుతుంది త‌ప్ప‌! చెప్పాల‌ని నిబంధ‌నేమి లేద‌న్న‌ది గ్ర‌హించాల్సిన విష‌యం అంటున్నారు. పెళ్లి చేసుకున్నా..చేసుకోక పోయినా ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ భార్య‌భ‌ర్త‌లే అన్న‌ది మెజార్టీ వ‌ర్గం ఎప్ప‌టి నుంచో భావిస్తుంది.

ప్రేమ విష‌యంలో ప‌లుమార్లు ఎదురుదెబ్బ‌లు తిన్న న‌య‌న్ విగ్నేష్ విష‌యంలో మాత్రం అలాంటి త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా ఇలా అన్నింటా ర‌హ‌స్యం వ‌హిస్తున్న‌ది అన్న‌ది మరికొంద‌రి అభిప్రాయం. కార‌ణాలేమైనా ఈ జంట‌ పెళ్లి వ్య‌వ‌హారం ఇప్ప‌టికే కాదు..ఎప్ప‌టికీ మిస్ట‌రీలానే మిగిలిపోయేలా క‌నిపిస్తుంది. అది వీడాలంటే ఆ జంట మీడియా ముందుకు రావాలి. అప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి క‌థ‌నాలు వెలువ‌డుతూనే ఉంటాయి. ఇక వృత్తి ప‌రంగా ఎవ‌రికి వారు బిజీగానే ఉన్నారు. న‌టిగా న‌య‌న్ క్రేజ్ కి తిరుగులేదు. కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొన‌సాగుతుంది. ఎలాంటి కాంట్ర‌వ‌ర్శీ తెర‌పైకి వ‌చ్చిన న‌య‌న్ స్పీడ్కి మాత్రం బ్రేకుల్లేవ్. ఇక విగ్నేష్ ద‌ర్శ‌కుడిగా బిజీగా ఉన్నారు.