Begin typing your search above and press return to search.

న‌య‌న్ (X) విఘ్నేష్‌.. అచ్చం సినిమాలోలానే

By:  Tupaki Desk   |   27 May 2021 2:30 AM GMT
న‌య‌న్ (X) విఘ్నేష్‌.. అచ్చం సినిమాలోలానే
X
న‌య‌న‌తార - విఘ్నేష్ శివన్ జోడీ పెళ్లికి రెడీ అవుతున్నారా? ఐదేళ్లుగా ఈ ప్ర‌శ్న రిపీట‌వుతూనే ఉంది. ఏ క్ష‌ణం అయినా పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌చార‌మ‌వుతూనే ఉంది. కానీ ఆ ఘ‌డియ ఇంకా రాలేదు.

న‌య‌న‌తార ఇంకా త‌న స్టార్ డ‌మ్ ని ఆస్వాధించేందుకు ఇక‌పైనా య‌థేచ్ఛ‌గా కొన‌సాగించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. 2020-21 సీజ‌న్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా న‌య‌న్ కెరీర్ కొన‌సాగుతోంది. ర‌జ‌నీకాంత్.. సేతుప‌తి స‌హా ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న నయ‌న్ న‌టిస్తోంది.

మ‌రోవైపు త‌న ప్రియుడు విఘ్నేష్ తో క‌లిసి విహార యాత్ర‌ల్ని ఆస్వాధిస్తోంది. ఈ జంట అన్యోన్య‌త గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజాగా న‌య‌న్ కి విఘ్నేష్ ప్ర‌పోజ్ చేస్తున్న ఓ ఫోటో ఎంతో ల‌వ్వ‌బుల్ గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అలా చేతిలో చెయ్యేసి విఘ్నేష్ త‌న ప్రియురాలితో ఎంతో గోముగా క‌నిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటోలో న‌య‌న్ స్పెష‌ల్ లుక్ అంతే ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. విఘ్నేష్ ఇస్మార్ట్ గా హీరోయిక్ లుక్ తో క‌నిపిస్తున్నాడు. క్యూట్ పెయిర్.. అచ్చం సినిమాలోలానే! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.