Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ లో నయన్‌-విఘ్నేష్ జంట‌ ప్రేమ కథ

By:  Tupaki Desk   |   20 July 2022 5:27 PM GMT
నెట్ ఫ్లిక్స్ లో నయన్‌-విఘ్నేష్ జంట‌ ప్రేమ కథ
X
అందాల న‌య‌న‌తార ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఐదేళ్ల సుదీర్ఘ‌ ప్రేమాయ‌ణం త‌ర్వాత‌ ఇటీవ‌లే ఈ జంట వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్- షారూక్ ఖాన్ స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ప్యాకేజీ కి కొనుగోలు చేసింది. ఈవెంట్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ త‌న‌దైన విజ‌న్ తో డాక్యుమెంట‌రీగా తెర‌కెక్కించారు.

ఈ డాక్యు సినిమాని త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ విడుద‌ల చేయ‌నుంది.

ఇంకా పేరు పెట్టని ఈ డాక్యు సినిమాలో నయనతార - విఘ్నేష్ ల ప్రేమకథను అందంగా చూపించ‌నున్నారు. జూన్ 9న త‌మిళ‌నాడు- మహాబలిపురంలోని ఒక పాపుల‌ర్ రిసార్ట్ లో వివాహంతో ముగిసే ఈ వీడియోలో రియ‌ల్ ప్రేమ‌ క‌థ‌ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

స్క్రిప్ట్ లేని కంటెంట్ ను ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్ది అభిమానుల‌కు అందించ‌డంలో మా ప్ర‌త్యేక‌త వేరు. దేశ‌విదేశాల్లో ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే శక్తి మాకు ఉంది. అందరికీ ఈ డాక్యు సినిమా అందుబాటులోకి తెస్తున్నామ‌ని నెట్ ఫ్లిక్స్ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు.

దాదాపు 20 సంవత్సరాల కెరీర్ లో నయనతార రియ‌ల్ సూపర్ స్టార్. మా అద్భుతమైన సృజనాత్మక భాగస్వాములు దర్శకుడు గౌతమ్ మీన‌న్‌ - రౌడీ పిక్చర్స్ కి ధ‌న్య‌వాదాలు. విఘ్నేష్ తో వివాహానికి దారితీసిన నయనతార ప్రయాణాన్ని ఎట్టకేలకు సినిమాగా వీక్షించేందుకు వేచి ఉండ‌లేం.. అని నెట్ ఫ్లిక్స్ అధినేత‌లు ప్ర‌క‌టించారు.

ఆ వివాదం నిజం కాదా?

న‌యన్- విఘ్నేష్ జంట వివాహానంత‌రం త‌మ పెళ్లి ఫోటోల‌ను అంత‌ర్జాలంలో లీక్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి నెట్ ఫ్లిక్స్ సీరియ‌స్ అయ్యింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి ఫోటోల‌ను పోస్ట్ చేయ‌డంతో కొత్త జంటకు స‌ద‌రు OTT దిగ్గజం లీగల్ నోటీసును పంపింద‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. నెట్ ఫ్లిక్స్ కు మాత్ర‌మే అన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయని వాదించిన‌ట్టు గుస‌గుస‌లు వినిపించాయి. వివాహ క‌వ‌రేజీ హక్కుల‌ కోసం స‌ద‌రు సంస్థ భారీ మొత్తాన్ని ఆ జంట‌కు చెల్లించిన‌ట్టు తెలిసింది.