Begin typing your search above and press return to search.

సాయి స‌న్నిధిలో దంప‌తులుగానా? ప్రేమికులుగానా?

By:  Tupaki Desk   |   6 May 2022 6:30 AM GMT
సాయి స‌న్నిధిలో దంప‌తులుగానా? ప్రేమికులుగానా?
X
విగ్నేష్ శివ‌న్-న‌య‌న‌తార‌ల ప్రేమ వ్య‌వ‌హారం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు ప్రేమ వైఫ‌ల్యాల త‌ర్వాత న‌య‌న్-శివ‌న్ తో రిలేష‌న్ లో కొన‌సాగుతుంది. అత‌గాడి కోసం ఏకంగా మ‌తం సైతం మార్చుకుంది. క్రైస్త‌వ మ‌తం నుంచి హిందు మ‌తంలోకి మారింది. అయితే ఈ జంట పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్న‌దానిపై మాత్రం స‌రైన స్ప‌ష్ట‌త లేదు.

ర‌హ‌స్యంగా హిందు సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి చేసుకున్నార‌ని కొంత మంది అంటుంటే..ఇంకా అంత‌వ‌ర‌కూ వెళ్ల‌లేద‌న్న‌ది మ‌రికొంత మంది వాద‌న‌. ఈ వాద‌న‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ప్రియుడిపై న‌యన్ కున్న ప్రేమ మాత్రం అపార‌మైన‌ద‌ని తెలుస్తోంది. విగ్నేష్ ని ఎంత‌గా ప్రేమిస్తుంది..ఎంత‌గా ఇష్ట‌ప‌డుతుందో త‌న చ‌ర్య‌ల్ని బ‌ట్టే తెలుస్తోంది.

ఆ మ‌ధ్య జాత‌కంలో దోషాలుంటే వాటిని తొల‌గించ‌డం కోసం హిందు సంప్ర‌దాయం ప్ర‌కారం చేయాల్సిన దోష‌నివార‌ణ పూజ‌లు..పున‌స్కారాలు న‌య‌న‌తార ఎంతో నియ‌మ‌ నిష్ట‌ల‌తో పూర్తి చేసింది. దోష‌నివార‌ణ‌లో భాగంగా ఓ చెట్టుని...వ‌రాహాన్ని సైతం న‌య‌న్ పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫోటోలులీకై నెట్టింట సంచ‌ల‌నం రేంపిన సంగతి తెలిసిందే.

అప్ప‌టి నుంచి ఈ జంట అదే ప‌నిగా హిందు దేవాల‌యాల్ని వ‌రుస‌గా సందర్శించ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. దాదాపు రెండున్నరేళ్ల‌గా హిందు దేవాల‌యాలే టార్గెట్ సంద‌ర్శ‌న కొనసాగుతుంది. త‌మిళ‌నాడు నుంచి మొద‌లు పెట్టి దేశంలో ప్రసిద్ద దేవాల‌యాల‌న్నింటిని సంద‌ర్శించి మొక్కులు చెల్లిస్తున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో కొంత‌ గ్యాప్ వ‌చ్చింది.

కోవిడ్ ఆంక్ష‌లు ఎత్తేసిన ద‌గ్గ‌ర నుంచి మ‌ళ్లీ ఈ జంట సంద‌ర్శ‌ల‌ను షురూ చేసి ముందుకు సాగుతోంది. మార్చి నెల‌లో లోనే త‌మిళ‌నాడులోని ఓ అమ్మ‌వారి దేవాల‌యంలో ఈ జంట ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. ఎంతో భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో ఈ పూజ‌లో జంట పాల్గొంది. తాజాగా షిర్డీసాయి బాబా ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

న‌య‌న్ పంజాబీ డ్రెస్ లో చేతుల్లో దేవుడు పువ్వుల‌తో క‌నిపిస్తున్నారు. విగ్నేష్ జీన్స్ ..ష‌ర్ట్ ధ‌రించి క‌నిపిస్తున్నారు. ఇద్ద‌రు నుదిట‌న గంధం..ప‌సుపు కుంకుమ బొట్టులు పెట్టుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం ఓ చెట్టుక్రింద కుర్చుని ఇలా కెమెరాకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోని ఉద్దేశించి విగ్నేష్ ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు.

` షిర్డీలో నా క‌న్మ‌నీతో..సాయిని ద‌ర్శించ‌కోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను`` అని రాసుకొచ్చారు. దీంతో మ‌రోసారి నెటిజ‌నులు పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకొస్తున్నారు. ఈ ద‌ర్శ‌నం దంప‌తులుగానా? ప్రేమికులుగానా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కానీ ఈ ప్ర‌శ్న‌కి సూటిగా స‌మాధానం ఎప్పుడొస్తుందో అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. ఇటీవ‌లే న‌య‌న‌తార‌-స‌మంత‌-విజ‌య్ సేతు ప‌తి న‌టించిన `కాతు వాకుల రెండు కాద‌ల్` రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ ఫ‌లితాలు మాత్రం ఆశాజ‌న‌కంగా రాలేదు.