Begin typing your search above and press return to search.

ప్రియుడితో చాలా నెలల తర్వాత హాలీడే ట్రిప్‌

By:  Tupaki Desk   |   14 Sept 2020 7:00 PM IST
ప్రియుడితో చాలా నెలల తర్వాత హాలీడే ట్రిప్‌
X
స్టార్‌ హీరోలు హీరోయిన్స్‌ మరియు ప్రముఖులు రెగ్యులర్‌ గా హాలీడే ట్రిప్‌ అంటూ నెలకు రెండు నెలలకు ఏదో ఒక దేశం లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లారు. హీరోయిన్‌ నయనతార ఆమె ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ రెగ్యులర్‌ గా అమెరికాకు హాలీడేకు వెళ్తూ ఉంటారు. అయితే గత ఏడు నెలలుగా వీళ్లు కరోనా కారణంగా దేశం దాటలేదు. చెన్నై మరియు కేరళలోనే వీరు గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు వారు యూఏఎస్‌కు వెళ్లకుండా గోవాకు హాలీడే ట్రిప్‌ వెళ్లారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ ప్రేమ జంట హాలీడే ట్రిప్‌ కు వెళ్లింది. గోవాలో వీరిద్దరు ప్రస్తుతం ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సౌత్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న ముద్దుగమ్మ నయనతార ఒక వైపు షూటింగ్స్‌ తో బిజీగా గడుపుతూ మరో వైపు ప్రియుడు విఘ్నేష్‌ తో విహారయాత్రకు వెళ్తూ ఉంటుంది. తాజాగా మరోసారి గోవాలో ఆమె ప్రియుడితో ఆమె ఎంజాయ్‌ చేస్తోంది. వీరిద్దరి పెళ్లి గురించి మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తున్నా కూడా పెద్దగా స్పందించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇద్దరికి ఉన్న గోల్స్‌ నెరవేరిన తర్వాత పెళ్లి చేసుకుంటాం అంటూ ఇటీవల విఘ్నేష్‌ శివన్‌ చెప్పుకొచ్చాడు.