Begin typing your search above and press return to search.

బంధం నిలబడేందుకు పూజలా?

By:  Tupaki Desk   |   11 Dec 2019 11:24 AM GMT
బంధం నిలబడేందుకు పూజలా?
X
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. సినిమాల్లో సూపర్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్నా కూడా ఈ అమ్మడికి వ్యక్తిగతంగా మాత్రం కాస్త బ్యాడ్‌ నేమ్‌ ఉంది. శింబు మరియు ప్రభుదేవాలతో ఈ అమ్మడి ప్రేమ వ్యవహారం మద్యలోనే బ్రేకప్‌ అయ్యింది. వారి నుండి విడిపోయిన తర్వాత విఘ్నేష్‌ శివన్‌ తో ప్రస్తుతం ప్రేమలో ఉంది. వీరిద్దరు గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు.

మొదట్లో వీరిద్దరు ప్రేమ విషయాన్ని దాచేందుకు ప్రయత్నించారు. కాని సోషల్‌ మీడియా ఎఫెక్ట్‌ తో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా లీక్‌ అయ్యింది. ప్రేమ విషయాన్ని వీరిద్దరు కూడా ఒప్పుకున్నారు. ప్రేమించుకున్న వీరిద్దరు గత కొంత కాలంగా సహజీవనం సాగిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నయన్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా ఉంది. సినిమా సినిమాకు పారితోషికం అమాంతం పెరిగి పోతూనే ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే కెరీర్‌ పరంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు.

అయితే ఈమద్య కాలంలో వీరిద్దరు తెగ గుడులు గోపురాలు తిరుగుతూ ఉన్నారు. నయనతార క్రిస్టియన్‌ అయినా కూడా విఘ్నేష్‌ తో కలిసి దేవాలయాల ప్రదర్శణ చేస్తోంది. వీరు ఇలా పూజలు చేస్తూ ఉంటే పెళ్లి కోసం అని కొందరు అంటూ ఉంటే మరి కొందరు ఈ ప్రేమ వ్యవహారం అయినా పెళ్లి వరకు రావాలని కోరుకుంటున్నావా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. గత ప్రేమలు విఫలం అయిన కారణంగా నయన్‌ ఈసారి ప్రేమ సక్సెస్‌ కోసం పూజలు గట్టిగానే చేస్తుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరు చేసిన.. చేస్తున్న పూజలు సఫలం అయ్యి ఈ జంట పెళ్లి పీఠలు ఎక్కుతారో చూడాలి.