Begin typing your search above and press return to search.

నాయకి ఉయ్యాలూగింది

By:  Tupaki Desk   |   26 Feb 2016 3:42 PM GMT
నాయకి ఉయ్యాలూగింది
X
త్రిష ఓ సినిమాపై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకొంది. తెలుగు ద‌ర్శ‌కుడు గోవి తెరకెక్కిస్తున్న ఆ చిత్రం `నాయకి`. ఇదివరకు ఓ చిన్న సినిమాని తీసిన గోవి తయారు చేసిన క‌థ బాగా న‌చ్చ‌డంతో అన్నీ తానై ఆ ప్రాజెక్టుని ముందుకు న‌డిపిస్తోంది త్రిష. నాయ‌కిగా తెలుగులో, నాయ‌గిగా తమిళంలో తెర‌కెక్కిన ఆ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. అందులో త్రిష ఉయ్యాలూగుతూ క‌నిపిస్తోంది.

నిజానికి ఈ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్లు మొద‌ట్నుంచీ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సైతం పోస్ట‌ర్ల‌నీ, అందులో త్రిష క‌నిపించిన విధానాన్ని చూసి మెచ్చుకొన్నాడు. సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కింది కాబ‌ట్టి యూనివర్స‌ల్ స‌బ్జెక్ట్‌తోనే సినిమాని తెర‌కెక్కించుంటార‌ని ఊహించొచ్చు. హ‌ర్రర్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్టుతో తెర‌కెక్కిన ఈ చిత్రం త‌ప్ప‌కుండా త‌న‌కి విజ‌యాన్ని అందిస్తున్న త్రిష త‌న స‌న్నిహితుల‌తో చెబుతోంద‌ట‌. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఇందులో త్రిష రెండు కోణాల్లో సాగే పాత్ర‌ని పోషించిన‌ట్టు తెలిసింది. త్రిష త‌మిళంలో దుమ్మురేపుతోంది కానీ... తెలుగులోనే మునుప‌టిలా విజ‌యాలు అందుకోలేక‌పోతోంది. అయితే ఈ సినిమాతో మాత్రం ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందే అన్న అభిప్రాయంతో క‌నిపిస్తోంది త్రిష‌. ఈ సినిమా హిట్టు కాక‌పోతే మాత్రం త్రిష తెలుగు కెరీర్‌కి పుల్‌స్టాప్ ప‌డ్డ‌ట్టే అవుతుంది మ‌రి!