Begin typing your search above and press return to search.

బాల్ థాకరే పాత్రలో ఆ నటుడా??

By:  Tupaki Desk   |   15 Dec 2017 4:34 AM GMT
బాల్ థాకరే పాత్రలో ఆ నటుడా??
X
బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల టైం నడుస్తోందని చెప్పుకోవచ్చు. ముందు క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారి కథలతో వరస పెట్టి సినిమాలు తీసిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పుడు మిగిలన రంగాలపైనా దృష్టి పెట్టారు. ఫేమస్ పర్సన్ల జీవితంలో కాస్త మెలో డ్రామా ఉంటే చాలు.. ఆ వ్యక్తి జీవిత గాథతో సినిమా తీసేస్తున్నారు. తాజాగా వీర హిందూత్వవాది అయిన శివసేన పార్టీ వ్యవస్థాపకుడు అయిన బాల్ థాకరే జీవితంపైనా సినిమా రానుంది.

ఇంతవరకు బాగానే ఉన్నా బాల్ థాకరే పాత్రకు నవాజుద్దీన్ సిద్ధిఖిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అసలు శివసేన వాళ్లంతా ముస్లింల పేరెత్తితేనే మండిపడతారు. అలాంటిది వాళ్లు ఆరాధ్య దైవంలా కొలిచే బాల్ థాకరే పాత్రను ఓ ముస్లిం నటుడు చేస్తే ఎంతవరకు జీర్ణించుకోగలరు అన్నది ఆలోచించాల్సిన విషయం. మిగిలిన వ్యక్తుల విషయంలో ఎవరు ఏ పాత్ర చేసినా బావుందనో లేదనో ఓ మాట అని వదిలేస్తారు. కానీ బాల్ థాకరే విషయం వేరు. రాజకీయ పరంగా.. మతపరంగా కీలకమైన వ్యక్తి. మహారాష్ట్రలో మరాఠా భాషకే పట్టం కట్టి తీరాలంటూ తెగేసిన చెప్పిన పెద్ద మనిషి. నవాజుద్దీన్ అత్యుత్తమ నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేకపోయినా బాల్ థాకరే పాత్రలో అతడిని ఒప్పుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న.

బాల్ థాకరే బయో పిక్ కు స్క్రిప్ట్ రెడీ చేస్తున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను ఇదే విషయమై అడిగితే ఈనెల 21న వచ్చే ఫస్ట్ లుక్ తరవాత అన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుందని చెప్పుకొచ్చారు. బాల్ థాకరే లైఫ్ లోని కొన్ని అంశాలు స్ఫూర్తిగా రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే సర్కార్ సినిమా మూడు పార్టులు తీశాడు. ఇంకా బాల్ థాకరే జీవితంలో తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అంటున్నారు సంజయ్ రౌత్.