Begin typing your search above and press return to search.

అతని మొదటి ప్రేమ ఎంత పనిచేసిందంటే..

By:  Tupaki Desk   |   10 Nov 2017 10:04 AM GMT
అతని మొదటి ప్రేమ ఎంత పనిచేసిందంటే..
X
ప్రేమంటే ఏమిటంటే.. నిను ప్రేమించినాక తెలిసే అంటూ కవితలు రాస్తేనో.. నిన్నటి ప్రేమను గుర్తు చేసుకుంటూ అందమైన కథలు రాస్తేనో చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అదే సెలబ్రిటీల ప్రేమ కథ అయితే మరింత ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. కానీ ప్రేమ అందమైనదే కాదు. చాలా కాస్ట్ లీ కూడా. ఈ విషయం బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది.

నవాజుద్దీన్ ఈ మధ్య తన జీవిత చరిత్రతో ఓ పుస్తకం రాశాడు. దాని పేరు యాన్ ఆర్డినరీ లైఫ్: ఎ మెమైర్. ఇందులో తన ఎలా పుట్టి పెరిగింది.. ఎలా నటుడయ్యింది... ఏవిధంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందీ రాసుకొచ్చాడు. అందులో భాగంగానే తన గత జీవితపు ప్రేమకథలన్నీ ఈస్ట్ మన్ కలర్ లో నెరేట్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇందులో నవాజుద్దీన్ రాసినవన్నీ పచ్చి అబద్ధాలంటూ అతడు తన ఫస్ట్ లవ్ గా చెప్పుకొచ్చిన సునీత రాజ్వర్ కోప్పడిపోతోంది. కోప్పడటమే కాదు.. కోర్టుకీడుస్తోంది. నవాజుద్దీన్ పై ఏకంగా రూ. 2 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ అతడికి ఏడు పేజీల లీగల్ నోటీసు పంపింది.

సునీత రాజ్వర్ స్జేజ్ డ్రామా యాక్టర్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటోంది. తనపై అవాకులు.. చవాకులు రాశాడంటూ నవాజుద్దీన్ తో కలిసి పుస్తకం రాసిన రితుపర్ణ ఛటర్జీ పబ్లిషర్లకు కూడా ఆమె నోటీసులిచ్చింది. ఇప్పటికే నవాజుద్దీన్ తన రెండో గర్ల్ ఫ్రెండ్ అంటూ రాసుకొచ్చిన యాక్టర్ నిహారికా సింగ్ అతడిపై అతడిపై కోర్టుకెక్కింది. అప్పుడే నవాజుద్దీన్ తప్పయిపోయిందంటూ బుక్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇంతలో సునీత రాజ్వర్ ఏకంగా పరువు నష్టం దావా వేసింది. ప్రేమెంత పనిచేసింది నవాజుద్దీన్!!