Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : విలక్షణ నటుడి లేడీ గెటప్ వైరల్‌

By:  Tupaki Desk   |   1 Feb 2022 11:30 PM GMT
ఫొటోటాక్ : విలక్షణ నటుడి లేడీ గెటప్ వైరల్‌
X
బాలీవుడ్‌ ట్యాలెంటెడ్‌... విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రస్తుతం టికు వెడ్స్ షేరు సినిమాలో నటిస్తున్నాడు. కంగనా రనౌత్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది. సాయి కబీర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖితో పాటు అన్వీత్‌ కౌర్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల కోసం నవాజుద్దీన్ సిద్దిఖీ లేడీ గెటప్ వేశాడు. లేడీ గెటప్ లో నవాజుద్దీన్ సిద్దిఖీ ని చూసి అంతా కూడా ఆశ్చర్య పోతున్నారు. విలక్షణ నటుడిగా ఎన్నో పాత్రల్లో నటించిన ఆయన ఇప్పుడు ఇలా కనిపించడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.

కంగనా రనౌత్‌ ఈ ఫొటోలను షేర్‌ చేసి చాలా హాట్ గా ఉన్నావు అంటూ నవాజుద్దీన్ సిద్దిఖీ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. సాదారణంగా ఎప్పుడు కాంట్రవర్సీ విషయాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి విమర్శల పాలు అయ్యే కంగనా రనౌత్‌ ఈసారి విభిన్నంగా అందరి దృష్టిని ఆకర్షించేలా నవాజుద్దీన్ సిద్దిఖి లేడీ గెటప్ ఫొటోలను షేర్‌ చేయడం ద్వారా స్పెషల్‌ గా నిలిచింది. కంగనా రనౌత్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్ తో తన మణికర్ణిక బ్యానర్ లో నిర్మిస్తుంది. సినిమాకు సంబంధించిన విడుదల తేదీ త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమా ను అమెజాన్ ఇప్పటికే కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అయితే సినిమా థియేటర్‌ రిలీజ్‌ తర్వాత స్ట్రీమింగ్‌ అవుతుందా లేదంటే ముందు స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి. ఈమద్య కాలంలో కరోనా వల్ల పెద్ద సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి. రాబోయే రెండు మూడు నెలల పాటు పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ థియేటర్‌ రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి. కనుక ఈ సినిమా థియేటర్‌ రిలీజ్ చేయాలంటే కాస్త కష్టమైన విషయమే. అందుకే ఈ సినిమాను థియేటర్‌ రిలీజ్ కంటే డైరెక్ట్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయడం బెటర్ అనే ఉద్దేశ్యంతో కొందరు బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు ఉన్నారు. కాని మేకర్స్ అభిప్రాయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.