Begin typing your search above and press return to search.

వామ్మో.. రజనీని వాడేసుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   11 Sept 2016 11:00 PM IST
వామ్మో.. రజనీని వాడేసుకుంటున్నాడు
X
ఎవరో ఒక పెద్ద స్టార్ ను వాడుకుని తమ సినిమాలకు క్రేజ్ తెచ్చుకోవడం కొందరి హీరోలకు అలవాటైపోయింది. మన టాలీవుడ్డులోనే కాదు బాలీవుడ్డులో కూడా ఇలాంటోళ్ళు చాలామందే తయారయ్యారు.

విలక్షణ పాత్రలతో బాలీవుడ్ సినిమా లవర్స్ ను ఆకట్టుకుంటున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఈ మధ్యనే మనోడు 'ఫ్రీకీ ఆలీ' అనే సినిమాతో హీరోగా దర్శనమిచ్చాడు. అయితే మనోడు ఈ సినిమాను ప్రమోట్ చేసుకోవడాని సూపర్ స్టార్ రజనీకాంత్ ను వాడేసుకుంటున్నాడు. తనతో పాటు హీరోయిన్లుగా నటించిన భామలకు నెక్ట్స్ సినిమానే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తున్నాడన్నాడు అంటున్నాడు ఈ గురుడు. అందుకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. తన సరసన మాంజీ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాధికా ఆప్టేకు వెంటనే కబాలీ.. అలాగే ఫ్రీకీ అలీలో గా నటించిన అమీజాక్సన్ కు రోబో 2.0 లో ఛాన్సొచ్చిందట. అలా చెప్పుకుని తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.

బాబూ నవాజూ.. రాధిక అసలు బాలీవుడ్డులో ఫేమస్ కాకముందే సౌత్ లో సినిమాలు చేసింది. ఆ విధంగా అమ్మడికి ఇక్కడ ఛాన్సొచ్చింది. ఇకపోతే శంకర్ తో ఆల్రెడీ పనిచేసిన ఆమీ జాక్సన్ కు ఆయనే మరోసారి ఛాన్సిచ్చాడు. అలా ఆమె 'ఐ' సినిమా తరువాత 'రోబో 2.0'లోకి వచ్చింది. కాని మనోడేమో తన సెంటిమెంట్ వలనే అంటూ ఇలా వాడేసుకుంటున్నాడు.