Begin typing your search above and press return to search.

నిజమైన మతం తెలుసుకున్న యాక్టర్

By:  Tupaki Desk   |   25 April 2017 7:33 AM GMT
నిజమైన మతం తెలుసుకున్న యాక్టర్
X
బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ఎంతో టాలెంటెడ్ నటుడు. అనేక చిత్రాల్లో తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించాడు. మన దేశంలో మతం అనే అంశానికి ఎంతగా ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. ఆ మధ్యన తన ఇస్లాం మతానికి విరుద్దం అని కండోమ్ యాడ్స్ ను ఎండార్స్ చేయడానికి ఒప్పుకోలేదు నవాజ్. అయితే ఇప్పుడు తన నిజమైన మతం ఏంటో తెలుసుకున్నాడట. అదే విషయాన్ని ఓ వీడియో ద్వారా అందరికీ రివీల్ చేసేశాడు.

పలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. తన నిజమైన మతంపై వివరాలు ఇచ్చాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. 'నేను నవాజుద్దీన్ సిద్దిఖీ. నేను నాకు DNA టెస్ట్ చేయించుకుని నేనెవరో తెలుసుకున్నాను. 16.66 శాతం హిందు.. 16.66 శాతం ముస్లిం.. 16.66 శాతం సిఖ్.. 16.66 శాతం క్రిస్టియన్.. 16.66 శాతం బుద్ధిస్ట్.. మరో 16.66 శాతం ఈ ప్రపంచంలోని ఉన్న అన్ని మతాలకు చెందిన వాడిని. కానీ నేను నా ఆత్మ గురించి తెలుసుకున్నపుడు నేను 100 శాతం ఆర్టిస్ట్ ని అనే విషయం తెలుసుకున్నాను' అని చెప్పాడు నవాజుద్దీన్ సిద్దిఖీ.

మతం గురించి కామెంట్స్ చేస్తూ.. ఇంత సున్నితంగా అన్ని మతాలు ఒకటే అని చెప్పడం.. కళాకారుడికి కుల మత తారతమ్యాలు ఉండవు అని వెల్లడించడం.. అందరినీ ఆకట్టుకునే విషయం. పెద్ద నటుడు అయి ఉండి.. ఇంత సున్నితంగా ఓ తీక్షణమైన అంశాన్ని.. అది కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండే.. అసలు నోరు తెరవకుండా చెప్పడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/