Begin typing your search above and press return to search.

బిగ్ బి మ‌న‌వ‌రాలు అత‌డి చుట్టూ వైఫైలా!

By:  Tupaki Desk   |   14 Nov 2022 3:30 AM GMT
బిగ్ బి మ‌న‌వ‌రాలు అత‌డి చుట్టూ వైఫైలా!
X
అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేళి నందా పేరు ఇటీవ‌ల మీడియా హెడ్ లైన్స్ లో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. న‌వ్య ఇంత‌వ‌ర‌కూ క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేయ‌లేదు. షో బిజ్ లో అస‌లే క‌నిపించ‌లేదు. కానీ ఎందుక‌ని ప్ర‌తిసారీ త‌న పేరు ఇలా మీడియాలో మార్మోగుతోంది? అంటే దానికి చాలా స్ప‌ష్ఠ‌మైన కార‌ణం ఉంది.

న‌వ్య న‌వేళి అమితాబ్ కుమార్తె అయిన‌ శ్వేతా నందా బ‌చ్చ‌న్ వార‌సురాలు. త్వ‌ర‌లోనే సినిమాల్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఇప్ప‌టికే తన పాడ్ కాస్ట్ లతో అంద‌రి దృష్టిని త‌న‌వైపున‌కు తిప్పుకుంది. సామాజిక మాధ్య‌మాల్లో పోస్టింగుల‌తోను ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడు నవ్య తన ల‌వ్ లైఫ్‌ గురించి కూడా వార్తల్లో నిలిచింది. ముంబై మీడియాలో క‌థ‌నాల‌ ప్రకారం.. కత్రినా కైఫ్ `ఫోన్ బూత్‌`లో న‌టించిన‌ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో నవ్య నవేలి డేటింగ్ చేస్తోంది. గ‌ల్లీ బోయ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ.. గెహ్ర‌యాన్ లాంటి రొమాంటిక్ మూవీ లోను సిద్ధాంత్ అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

న‌వ్య ఈ ప్ర‌తిభావంతుడి చుట్టూనే వైఫైలా తిరుగుతోంద‌నేది గుస‌గుస‌. ఇటీవ‌లే చ‌తుర్వేది ఇంటి దగ్గర న‌వ్య న‌వేళి కనిపించడంతో ఈ వార్త మరింత వైరల్ అయ్యింది. అయితే ఆ ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్నారా లేరా? అన్న‌దానికి ఇంత‌కుమించిన ఆధారాలేవీ లేవు. ఇప్ప‌టికి ఇవ‌న్నీ ఊహాగానాలే అయినా ఆ ఫోటో వీడియో వైరల్ గా మార‌డంతో ఇదే నిజ‌మ‌ని అంతా భావిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరూ దీని గురించి పెద‌వి విప్ప‌క‌పోవ‌డం సందేహాల‌కు తావిస్తోంది. బాలీవుడ్ లో జాన్వీ క‌పూర్ సోద‌రి ఖుషీ క‌పూర్.. షారూక్ కుమార్తె సుహానా ఖాన్.. సంజ‌య్ క‌పూర్ కుమార్తె స‌న‌య‌ క‌థానాయిక‌లుగా ఆరంగేట్రం చేస్తున్నారు. త‌దుప‌రి ఆరంగేట్రం బ‌హుశా అమితాబ్ మ‌న‌వ‌రాలు నవ్య న‌వేళి అని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. దీనికోసం బ‌చ్చ‌న్ అభిమానులు అంతే ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.