Begin typing your search above and press return to search.

కరోనా: విషమించిన నటి - ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం

By:  Tupaki Desk   |   15 Aug 2020 4:00 PM IST
కరోనా: విషమించిన నటి - ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం
X
టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్.. ప్రస్తుతం రాజకీయాల్లోకి మారి ఎంపీగా కొనసాగుతున్న నవనీత్ కౌర్ పరిస్థితి కరోనా కారణంగా విషమంగా ఉన్నట్టు తెలిసింది. రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన ‘యమ దొంగ’ సినిమాలో ‘యంగ్ యమ యంగ్ యమ’ అనే ప్రత్యేక పాటలో రంభ పాత్ర పోషించింది నటి నవనీత్ కౌర్. ఆర్పీ పట్నాయక్ హీరోగా వచ్చిన ‘శీను వాసంతి లక్ష్మీ’లోనూ ఈమె నటించింది. ప్రస్తుతం నవనీత్ కౌర్ తోపాటు ఆమె భర్త.. పిల్లలకు కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ముంబై మిర్రర్‌ పత్రిక నుంచి వెలువడ్డ కథనం ప్రకారం.. నవనీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈమెను ముంబై ఆసుపత్రికి తరలించారు. వాస్తవానికి, ఆమె పిల్లలు పాజిటివ్‌గా పరీక్షించబడ్డారు. తన పిల్లలను ఆమె దగ్గరుండి చూసుకోగా వైరస్ నవనీత్ కౌర్ కు సోకింది.

ఈమె కుటుంబం మొత్తం ఇంట్లోనే హోంక్వారంటైన్ లో ఉంటున్నారు. వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. అయితే నవనీత్ కౌర్ పరిస్థితి విషమంగా మారడంతో తొలుత నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా మార్పు రాకపోవడంతో ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రికి తరలించారు.

రాజకీయ నాయకురాలుగా మారిన నటి నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు.

ఇక నవనీత్ కౌర్ యే కాదు..ప్రసిద్ధ తెలుగు గాయకుడు ఎస్.పి.బాలు పరిస్థితి విషమంగా మారినట్టు తెలిసింది.వీరంతా త్వరగా కోలుకోవాలని ఆశిద్ధాం.