Begin typing your search above and press return to search.

ఫొటో టాక్‌ : గుర్తించలేకుండా మారిన యంగ్‌ హీరో

By:  Tupaki Desk   |   30 April 2020 9:36 AM IST
ఫొటో టాక్‌ : గుర్తించలేకుండా మారిన యంగ్‌ హీరో
X
ఈ ఫొటోలో సీనియర్‌ నరేష్‌ తో ఉన్న వ్యక్తిని ఠక్కున గుర్తించలేక పోతున్నారు కదా. ఇతడు నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ కృష్ణ. రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించిన నవీన్‌ కొంత గ్యాప్‌ తర్వాత సోషల్‌ మీడియాలో ఇలా కనిపించాడు. గత ఏడాది వచ్చిన ‘ఊరంతా అనుకుంటున్నారు’ చిత్రంలో ఇతడి లుక్‌ నార్మల్‌ గానే ఉంది. కాని ఉన్నట్లుంది ఇప్పుడు మాత్రం గుర్తు పట్టలేనంతగా మార్పు వచ్చింది. ఇతడి మొదటి సినిమా నందిని నర్సింగ్‌ హోమ్‌ చిత్రం 2016లో విడుదల అయ్యింది.

మొదటి సినిమాతోనే నిరాశ పర్చిన నవీన్‌ కు రెండవ సినిమాకు చాలా సమయం పట్టింది. బలమైన వారసత్వం ఉన్నా కూడా ఇతడు హీరోగా సక్సెస్‌ కాలేక పోయాడు. చేసిన రెండు సినిమాలు నిరాశ పర్చడం తో ఇక హీరోగా ప్రయత్నాలు చేయకూడని భావించాడో ఏమో కాని ఇలా గుర్తు పట్టలేనంతగా లావు అయ్యాడు. మొహంలో కూడా చాలా మార్పు వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫొటో చూసిన తర్వాత ఇకపై నవీన్‌ ఖచ్చితంగా హీరోగా చేయక పోవచ్చు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

లెజెండ్రీ లేడీ డైరెక్టర్‌ విజయ నిర్మల వారసుడిగా నవీన్‌ సినీ రంగ ప్రవేశం చేశాడు. కాని లక్‌ కలిసి రాక పోవడంతో పాటు పలు కారణాలతో నవీన్‌ సినీ కెరీర్‌ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. హీరోగా కాకున్నా కొన్నాళ్లు వెయిట్‌ చేసి క్యారెక్టర్‌ ఆర్టిస్టు గా నవీన్‌ బిజీ అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అలాగే భవిష్యత్తులో నవీన్‌ కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారుతాడేమో చూడాలి. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆఫర్లు తెచ్చుకోవాలన్నా కూడా బరువు తగ్గాల్సిందే. మరి ఈ లాక్‌ డౌన్‌ తర్వాత ఏమైనా వర్కౌట్స్‌ ను నవీన్‌ ప్రారంభించి బరువు తగ్గేనా అనేది చూడాలి.