Begin typing your search above and press return to search.

ఏజెంట్ బాలీవుడ్ బోణీ కొట్టాడు

By:  Tupaki Desk   |   9 Sep 2019 1:30 AM GMT
ఏజెంట్ బాలీవుడ్ బోణీ కొట్టాడు
X
మొన్న శుక్రవారం తెలుగు సినిమాల సందడి పెద్దగా లేదు కానీ బాలీవుడ్ లో చిచోరే మంచి అంచనాల మధ్య విడుదలైంది. అందులోనూ సాహోకు నెగటివ్ టాక్ కంటిన్యూ కావడం వసూళ్లలో డ్రాప్ అంతకంతకూ పెరగడం దీనికి బాగా ప్లస్ అయ్యింది. సుశాంత్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఈ మూవీలోనూ శ్రద్దా కపూరే హీరోయిన్ కావడం మరో విశేషం. ఇదిలా ఉండగా ఇందులో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కీలక పాత్ర పోషించిన నవీన్ పోలిశెట్టికి ఇదే అక్కడి డెబ్యూ మూవీ.

ఇక్కడెలాగూ ఫస్ట్ మూవీ సూపర్ హిట్ పడింది. ఇప్పుడు హిందీలోనూ మంచి ఓపెనింగ్ దక్కించుకున్నాడు. షార్ట్ ఫిలింస్ లో పేరు తెచ్చుకుని తన టైమింగ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో ఫస్ట్ మూవీనే హిట్టు కొట్టిన నవీన్ కు చిచోరే రూపంలో అక్కడ కూడా మొదటి బాలే బౌండరీ తగిలింది .చిచోరే మంచి పాజిటివ్ రిపోర్ట్స్ తో వీకెండ్ ని వాడుకునే పనిలో ఉంది.

లెన్త్ విషయంలో మెలో డ్రామా విషయంలో కొంత మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ప్రేక్షకులు చిచోరేను హిట్టిచ్చే దిశగానే తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఫ్రెండ్ షిప్ సీన్స్ ఎమోషనల్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ నవీన్ పోలిశెట్టి హీరో ఫ్రెండ్ అయినప్పటికీ ప్రాధాన్యత ఉన్న సీన్లు డైలాగులు పడ్డాయి. దీంతో అక్కడ కూడా ఆఫర్స్ వెల్లువెత్తడం ఖాయమనే మాట వినిపిస్తోంది. మొత్తానికి ఇటు తెలుగులో అటు హిందీ ఒకే ఏడాది డబుల్ బొనాంజా కొట్టడం నవీన్ కష్టానికి తగ్గ ఫలితమనే చెప్పాలి