Begin typing your search above and press return to search.

ఏజెంట్ ని సరిగ్గా వాడుకుంటే పండగే

By:  Tupaki Desk   |   25 Jun 2019 7:00 AM IST
ఏజెంట్ ని సరిగ్గా వాడుకుంటే పండగే
X
మొన్న శుక్రవారం విడుదలైన ఆరు తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో యునానిమస్ గా విన్నర్ గా నిలిచిన మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. మల్లేశంకు సైతం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్లే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. కానీ ఏజెంట్ మాత్రం దానికి భిన్నంగా అటు టాక్ తో పాటు ఇటు కలెక్షన్లను స్టడీగా మైంటైన్ చేస్తున్నాడు. నిన్న దాదాపు అన్ని కేంద్రాల్లోనూ హౌస్ ఫుల్స్ పడటం దానికి నిదర్శనం.

ఇప్పుడు దర్శకుడు స్వరూప్ కన్నా ఎక్కువ హీరోగా టైటిల్ రోల్ చేసిన నవీన్ పోలిశెట్టి టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు. మొన్నటి దాకా యుట్యూబ్ అండ్ సోషల్ మీడియా సెలబ్రిటీగా ఉన్న నవీన్ ఇప్పుడు ఒక్క సినిమాతో ఊహించని స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇప్పుడు వచ్చే ఆఫర్స్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం నవీన్ చేతుల్లో ఉంది.ఇతన్ని ప్రెజెంట్ జెనరేషన్ లో విజయ్ దేవరకొండతో పోలుస్తున్న వాళ్ళు లేకపోలేదు.

ఒకరకంగా చెప్పంటే నవీన్ కు ఇది పెళ్లి చూపులు తరహా సక్సెస్ అన్నమాట. విజయ్ దేవరకొండలా ఇమేజ్ ని మార్కెట్ ని బలపర్చుకోవాలి అంటే అర్జున్ రెడ్డి-గీత గోవిందం స్థాయిలో ఇండస్ట్రీ హిట్ తక్కువ సమయంలో పడాలి. అదే జరిగితే నవీన్ పోలిశెట్టి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదంత ఈజీ అయితే కాదు. కథ విషయంలో తొందరపడకుండా కాంబినేషన్ల ట్రాప్ లో పడకుండా చక్కగా ప్లాన్ చేసుకుంటే అదేమంత కష్టం కాదు. ఒక్కసారి సెటిలైపోతే ఆపై టెన్షన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు