Begin typing your search above and press return to search.

తొలి సినిమా విడుదలవకుండానే ఇంకో ఛాన్స్

By:  Tupaki Desk   |   17 July 2015 8:01 AM GMT
తొలి సినిమా విడుదలవకుండానే ఇంకో ఛాన్స్
X
ఇంకా తొలి సినిమా విడుదలే కాలేదు.. అంతలోనే రెండో సినిమా ఆఫర్ పట్టేశాడు నవీన్ కృష్ణ. సీనియర్ నటుడు నరేష్ కొడుకే ఈ నవీన్ కృష్ణ. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ కొత్త కథానాయకుడు ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమాతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమా విడుదలకు ముందే తన రెండో సినిమాను మొదలుపెట్టబోతున్నాడు నవీన్ కృష్ణ. ఓ కొత్త దర్శకుడు రూపొందించే ఈ సినిమాతో ఓ ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ నిర్మాతగా మారబోతున్నాడట. ఇదో సరికొత్త జానర్లో సాగే సినిమా అని.. మొత్తం షూటింగ్ శ్రీలంకలో ఏకధాటిగా 45 రోజుల్లో పూర్తి చేస్తారని చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

నవీన్ తొలి సినిమా విషయానికి వస్తే.. ఖడ్గం సినిమాలోని పాట పల్లవినే టైటిల్ గా పెట్టుకున్న ఈ సినిమాను చంటి అడ్డాల నిర్మిస్తున్నాడు. రాంప్రసాద్ రగుతు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అచ్చు సంగీత దర్శకుడు. ఆగస్టులో ఆడియో విడుదల చేసి.. సెప్టెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు.