Begin typing your search above and press return to search.

కుర్రాడికి మహేష్ బూస్ట్ పట్టిస్తాడా

By:  Tupaki Desk   |   18 Oct 2016 10:30 PM GMT
కుర్రాడికి మహేష్ బూస్ట్ పట్టిస్తాడా
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఫంక్షన్స్ కు అటెండ్ అవడం చాలా తక్కువగా జరుగుతుంది. తనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తేనే.. తీసుకునేందుకు మహేష్ హాజరైన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది వేరే హీరోల సినిమా వేడుకల్లో అంటే.. అది మరీ అరుదు. కానీ సీనియర్ నరేష్ కొడుకు నవీన్ నటించిన నందినీ నర్సింగ్ హోమ్ ఆడియో లాంఛింగ్ ఫంక్షన్ కోసం మహేష్ అటెండ్ కావడం జరిగింది. ఆ రోజు ప్రిన్స్ ప్రవర్తనపై చాలానే విశ్లేషణలుంటాయ్ కానీ.. ఇప్పటికి నందినీ నర్సింగ్ హోమ్ రిలీజ్ సంగతులు చెప్పేసుకుందాం.

మహేష్ అటెండెన్స్ తో నందినీ నర్సింగ్ హోమ్ జనాల్లోకి బాగానే వెళ్లింది. అక్టోబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు మాత్రం పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. ఆ సిట్యుయేషన్ ఏర్పడాలంటే.. అర్జంటుగా మహేష్ యాక్టివ్ గా ఏదైనా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ బాగా బిజీగా సినిమా పనుల్లో ఉన్నాడు కాబట్టి.. కనీసం ట్విట్టర్ లో అయినా శుభాకాంక్షలు చెప్పడం.. ఏదైనా పాజిటివ్ ట్వీట్స్ పెట్టడం అయినా చేస్తేనే.. నందినీ నర్సింగ్ హోమ్ కి ఓపెనింగ్స్ దక్కుతాయి.

అసలు ఆడియో ఫంక్షన్ కి రావడానికే మహేష్ ఇష్టపడకపోతే.. కృష్ణ-విజయ నిర్మల బాగా బలవంతపెట్టాక వచ్చాడని అంటారు. అలాంటిది ఇప్పుడు తన బిజీ షెడ్యూల్ లో నందినీ నర్సింగ్ హోమ్ కోసం.. కాస్తంత చొరవ ఎంత మేరకు తీసుకుంటాడో ఆలోచించాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/