Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేగా మారుతున్న బాలరెడ్డి

By:  Tupaki Desk   |   10 Aug 2020 6:09 PM IST
ఎమ్మెల్యేగా మారుతున్న బాలరెడ్డి
X
ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అరవింద సమేత చిత్రంలో నవీన్‌ చంద్ర పాత్ర మరియు అతడి నటన అందరికి నచ్చింది. బాలరెడ్డి పాత్రలో నవీన్‌ చంద్ర అద్బుతంగా నటించాడంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత నవీన్‌ కు యంగ్‌ విలన్‌ గా పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. కాని ఆయన మాత్రం ఆచితూచి చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు పెద్ద సినిమాల్లో విలన్‌ గా నటింస్తున్నాడు.

ఇటీవలే ‘భానుమతి అండ్‌ రామకృష్ణ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్‌ చంద్ర మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు. బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో రూపొందుతున్న చిత్రంలో విలన్‌ గా ఈయన కనిపించబోతున్నాడు. ఆ సినిమాలో యంగ్‌ విలన్‌ పాత్రలో నవీన్‌ చంద్ర నటిస్తున్నాడట. నెగటివ్‌ షేడ్స్‌ ఉండే ఆ పాత్రతో మరోసారి నవీన్‌ చంద్ర తన నటన ప్రతిభను కనబర్చబోతున్నాడు అంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్యను ఢీ కొట్టేందుకు బాలీవుడ్‌ విలన్‌ ను కూడా దించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై కన్ఫర్మ్‌ కాలేదు.

బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ సినిమాకు అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కీలక పాత్రల్లో నటీనటుల ఎంపిక విషయంలో బోయపాటి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అందుకే ఈ చిత్రంలో నవీన్‌ చంద్రను ఎమ్మెల్యే పాత్ర కోసం ఎంపిక చేశారట. కరోనా కారణంగా నిలిచి పోయిన షూటింగ్‌ ఈ ఏడాది చివరి వరకు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌ లో సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.