Begin typing your search above and press return to search.

వైఫ్ ను తొలిసారి పరిచయం చేసి సర్ ప్రైజ్ చేసిన నవీన్ చంద్ర

By:  Tupaki Desk   |   16 Feb 2022 4:38 AM GMT
వైఫ్ ను తొలిసారి పరిచయం చేసి సర్ ప్రైజ్ చేసిన నవీన్ చంద్ర
X
రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. తనకుంటూ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటున్న హీరోలలో నవీన్ చంద్ర ఒకరు. తాను చేసే ప్రతి సినిమా సమ్ థింగ్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంటాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న అతడికి సంబంధించిన పర్సనల్ విషయాలు పెద్దగా బయటకు వచ్చింది లేదు. అసలు అతడికి పెళ్లైందా? లేదా? అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రేమికుల దినోత్సవం రోజున తన సోషల్ మీడియా ఖాతాలో తన వైఫ్ ఫోటోను షేర్ చేసి అందరిని సర్ ప్రైజ్ చేశాడు.

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన అతడు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇటీవల బాహుబలి నిర్మాతలు నిర్మించిన ‘పరంపర’ వెబ్ సిరీస్ లో నటించిన అతడు.. కొత్త ఫ్యాన్ బేస్ ను తయారు చేసుకున్నాడు. మిగిలిన వారికి భిన్నంగా.. తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తనకంటూ కొత్త క్రేజ్ ను క్రియేట్ ను చేసుకుంటున్న నవీన్ చంద్ర.. తన వైఫ్ ను తొలిసారి అందరికి పరిచయం చేశాడు.

దీంతో.. అసలు నవీన్ చంద్రకు ఎప్పుడు పెళ్లైంది? అన్నది ప్రశ్నగా మారింది. ‘ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్ ఓర్మా’ అంటూ ఆమెతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేశాడు. దీంతో.. సదరు పోస్టు కాస్త ఆలస్యంగా వైరల్ గా మారింది. ఆశ్చర్యం నుంచి తేరుకుంటున్న పలువురు.. అతనికి విషెస్ చెబుతున్నారు.