Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్ర.. నిజమేనా?

By:  Tupaki Desk   |   16 Jun 2020 11:50 AM GMT
బాలయ్య సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్ర.. నిజమేనా?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం బాలకృష్ణకు ప్రత్యేకమైన శైలి ఉంది. ఒక మేనరిజం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా బాలయ్య అభిమానులను ప్లాప్ సినిమాలతో నిరాశ పరుస్తున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు.. మహానాయకుడు తర్వాత భారీ అంచనాలతో వచ్చిన రూలర్ కూడా ప్లాప్ అయింది. ఇక ప్రస్తుతం బాలయ్యకు హిట్ తప్పనిసరి అయింది. అయితే ఈసారి బాలయ్య తనకు రెండు భారీ హిట్లిచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించటంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య అభిమానులకు బోయపాటి అంటే మంచి నమ్మకంతో పాటు ప్రత్యేక అభిమానం ఉంది. ఎందుకంటే బోయపాటి వేరే హీరోలను ఎలా చూపించినా బాలయ్యను మాత్రం ఓ రేంజ్ లో చూపిస్తాడని వాళ్ల అభిప్రాయం.. అదే మళ్లీ బిబి3 టీజర్ తో నిజం చేసాడు కూడా.

బోయపాటితో బాలయ్య చేసే సినిమాలలో డైలాగ్స్ యాక్షన్ అంతా హై రేంజ్ లో ఉంటాయి. ఇక బిబి3 గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. బాలయ్య కోసం బోయపాటి పవర్ ఫుల్ విలన్లను ఎంపిక చేస్తున్నాడట. అందులో ఓ విలన్ గా హీరో శ్రీకాంత్ నటిస్తుండగా.. మరో విలన్ కోసం బాలీవుడ్ ఇండస్ట్రీలో గాలింపు మొదలు పెట్టాడని తెలుస్తుంది. అయితే బోయపాటి రెగ్యులర్ ఫార్ములా లాగే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉండబోతుందట. ఆ పాత్ర కోసం యంగ్ యాక్టర్ నవీన్ చంద్రను ఎంపిక చేసినట్లు సమాచారం. నవీన్ ఇదివరకే ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో కీలక పాత్ర పోషించి మెప్పించాడు. ఇక ఈ సినిమాలో సింహ లెజెండ్ సినిమాలకు మించి భారీ ఫైట్ సీక్వెన్స్ రూపొందిస్తున్నారట చిత్రయూనిట్. ఈ మూవీని పక్కా మాస్ మసాలా అంశాలతో భారీ కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్. ఇక ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.