Begin typing your search above and press return to search.

బ్లాక్‌ బస్టర్‌ మిస్సయిన అరవింద దొరికింది..!

By:  Tupaki Desk   |   14 Oct 2018 1:28 PM GMT
బ్లాక్‌ బస్టర్‌ మిస్సయిన అరవింద దొరికింది..!
X
‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా నవీన్‌ చంద్ర ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మొదటి సినిమాలోనే మంచి నటుడిగా నిరూపించుకున్న నవీన్‌ చంద్ర ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించాడు. తాజాగా అరవింద సమేత చిత్రంలో కీలకమైన విలన్‌ పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. అరవింద సమేత చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో నవీన్‌ చంద్ర గురించి ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడుతూ పాత్ర బాగుంటుందని, మంచి నటనతో పాత్రకు జీవం పోశాడు అంటూ కామెంట్‌ చేశాడు. సినిమా విడుదలయ్యాక అది నిజమే అంటూ విశ్లేషకులు కూడా నవీన్‌ చంద్ర గురించి అంటున్నారు.

‘అరవింద సమేత’ చిత్రం సూపర్‌ హిట్‌ నేపథ్యంలో నేడు థ్యాంక్స్‌ మీట్‌ ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్బంగా నవీన్‌ చంద్ర మాట్లాడుతూ తనకు ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రం ఛాన్స్‌ వచ్చి మిస్‌ అయ్యిందని, ఆ సినిమా హిట్‌ అయిన తర్వాత మంచి ఛాన్స్‌ మిస్‌ అయ్యానని బాధ పడ్డాను. కాని తాజాగా ఈ చిత్రంలో నటించిన తర్వాత ఆ సినిమా మిస్‌ అయినందుకు బాధ పోయిందని పేర్కొన్నాడు.

ఆర్‌ ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి ఆ చిత్ర కథను పలువురు హీరోల వద్దకు తీసుకు వెళ్లాడు. అదే సమయంలో నవీన్‌ చంద్ర వద్దకు ఆ కథ వెళ్లింది. ఆ కథ నచ్చక పోవడంతో అజయ్‌ భూపతికి నవీన్‌ చంద్ర నో చెప్పాడంటూ అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తాజాగా నవీన్‌ చంద్ర ఆ విషయం నిజమే అని, ఆ సక్సెస్‌ మిస్‌ అయినా అరవింద సమేతలో నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ప్రకటించడం జరిగింది. నవీన్‌ చంద్ర కెరీర్‌ లో అరవింద సమేతలోని విలన్‌ పాత్ర నిలిచి పోతుందని, ఇప్పటి నుండి అతడికి మంచి పాత్రలు వస్తాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.