Begin typing your search above and press return to search.

ఉపాసన షోలో నవదీప్‌ డ్రగ్స్‌ చర్చ

By:  Tupaki Desk   |   19 Dec 2020 3:30 PM IST
ఉపాసన షోలో నవదీప్‌ డ్రగ్స్‌ చర్చ
X
మెగా ఇంటి కోడలు ఉపాసన మల్టీ ట్యాలెంటెడ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎన్నో వ్యాపారాలు చేస్తూనే ఫిట్‌ నెస్‌ పై అత్యధిక దృష్టి పెడుతుంది. ఆమె యువర్‌ లైఫ్‌ అనే వెబ్‌ పోర్టల్‌ కు గెస్ట్‌ ఎడిటర్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. యువర్‌ లైఫ్‌ కోసం ప్రతి వారం ఒక సెలబ్రెటీని తీసుకు వచ్చి ఆరోగ్యపరమైన అప్‌ డేట్‌ ను ఇస్తూ ఉంటుంది. హెల్త్ టిప్స్‌ ను ఇవ్వడంతో పాటు వారికి సంబంధించిన ఆహారపు అలవాటర్లను తెలుసుకుంటుంది. ఇక ఈవారం నవదీప్ ను ఉపాసన తీసుకు వచ్చారు. నవదీప్ అనగానే ఎక్కువ మంది పార్టీలు పబ్ లు డ్రగ్స్‌ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఉపాసన కూడా తన షో లో నవదీప్‌ తో డ్రగ్స్ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది.

ప్రతి ఒక్కరి జీవితంలో డ్రగ్స్‌ ను ఏదో ఒక విధంగా తీసుకుంటున్నారు. మెడిసిన్స్‌ రూపంలో తీసుకునే డ్రగ్స్‌ ను కంట్రోల్‌ చేయడం ఎలా.. ఒక్కసారి అలవాటు పడ్డ డ్రగ్స్‌ కు దూరం అవ్వడం ఎలా అనే విషయాలను ఉపాసన ఈ వారం తన షోలో చూపించబోతున్నారు. హై ఆన్‌ లైఫ్‌ పేరుతో సాగబోతున్న ఈ చర్చ కార్యక్రమంలో న్యూరాలజీ డాక్టర్ సి రాజేష్‌ తో కలిసి నవదీప్‌ డ్రగ్స్‌ విషయమై మాట్లాడబోతున్నారు. డ్రగ్స్ వ్యసనంగా మారిన సమయంలో దాన్ని ఎలా అధిగమించాలనేది డాక్టర్‌ తన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు నవదీప్‌ తన అనుభవాలను వివరించబోతున్నాడు.