Begin typing your search above and press return to search.

రేవ్ పార్టీ ఇదే.. చూసి తరించండి -నవదీప్

By:  Tupaki Desk   |   26 March 2016 9:37 AM GMT
రేవ్ పార్టీ ఇదే.. చూసి తరించండి -నవదీప్
X
హీరో నవదీప్ కి ఇప్పుడు అసహనం వచ్చింది. ఫ్రెండ్స్ - ఫ్యామిలీతో చేసుకున్న డిన్నర్ పార్టీని.. రేవ్ పార్టీగా మార్చేసిన మీడియా ఘనులపై.. నవదీప్ కు కోపం రావడం సహజమే. ఎందుకంటే.. ఆ పార్టీకి అమ్మను కూడా తీసుకెళ్లిన నవదీప్.. రేవ్ పార్టీ న్యూస్ రాస్తున్నవారికి సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నాడు.

'ఒక వేళ ఆ పార్టీలో మా అమ్మ లేకుండా ఉంటే.. ఉదయాన్నే వీటన్నిటినీ చూసి ఆమె నన్ను నమ్మేది కాదేమో! అప్పుడామెకు ఎవరు సమాధానం చెబ్తారు' అంటూ నిలదీశాడు నవదీప్. అంతే కాదు.. 'నేను మా అమ్మతో పార్టీ చేసుకుంటే మీకేంటి సమస్య. టీఆర్పీల కోసం ఇష్టం వచ్చినట్లు న్యూస్ వేస్తారా.. కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా.. నన్ను అడగకుండా.. ఇష్టం వచ్చినట్లు వార్తలు వేసేయడమేనా.. బ్లైండ్ జర్నలిజం' అంటున్నాడీ హీరో. అంతటితో ఆగకుండా.. రేవ్ పార్టీ జరగిందని హంగామా చేస్తున్న రోజున అక్కడ ఏం జరిగిందో ఫోటోలను కూడా ఇచ్చాడు నవదీప్.

చిన్న పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రాంలు - ఫ్యామిలీ గేదరింగ్ - ఫ్రెండ్స్ తో సరదా ఆటలు.. ఇవీ ఆ ఫోటోల్లో కనిపిస్తున్న దృశ్యాలు. వీటిని నవదీప్ తో పాటు.. ఆ ఈవెంట్ కి హాజరైన వారు కూడా పోస్ట్ చేస్తున్నారు. రేవ్ పార్టీ అంటూ మీడియా హంగామా చేస్తున్న రోజున జరిగింది ఇదీ అని చెబ్తున్నారు. 'చూడండి. మీరంతా కలిసి నేను మా అమ్మ - కుటుబంతో సహా పారిపోయానని చెబుతున్న రేవ్ పార్టీ ఇదే' అంటూ మండిపడుతున్నాడు నవదీప్. మరీ ఇంతగా ఫేక్ న్యూస్ వేస్తే.. ఎవరికైనా అసహనం వస్తుంది. నవదీప్ ఆవేశంలో అర్ధం ఉందని అనిపిస్తోంది కదా.