Begin typing your search above and press return to search.

మణిరత్నం 'నవరస' ట్రైలర్: తొమ్మిది భావోద్వేగాలు.. తొమ్మిది క‌థ‌ల స‌మాహారం..!

By:  Tupaki Desk   |   27 July 2021 8:44 AM GMT
మణిరత్నం నవరస ట్రైలర్: తొమ్మిది భావోద్వేగాలు.. తొమ్మిది క‌థ‌ల స‌మాహారం..!
X
ప్రముఖ దర్శకుడు మణిరత్నం - రచయిత జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ కలసి భారీ తారాగణంతో రూపొందించిన ఆంథాల‌జీ సిరీస్ ''నవరస''. నవరసాలు కథాంశంగా తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలను ఇందులో చూపిస్తున్నారు. హాస్యం - శృంగారం - భయానకం - కరుణ - రౌద్రం - కోపం - ధైర్యం - అద్భుతం - బీభత్సం లాంటి మాన‌వ జీవితంలోని నవరసాల ఎమోషన్స్ ఈ సిరీస్ రూపొందింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో ఆగ‌స్ట్ 6న ఈ ఆంథాల‌జీని స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'నవరస' ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

తొమ్మిది రకాల భావోద్వేగాలు కలబోసిన 'నవరస' ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. గోవింద వసంత అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది. సూర్య - విజయ్ సేతుపతి - బాబీ సింహా - ప్రకాష్ రాజ్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ - అరవింద్ స్వామి - నిత్యా మీనన్ - ఐశ్వర్య రాజేష్ - విక్రాంత్ - గౌతమ్ కార్తీక్ - శ్రీరామ్ - అశోక్ సెల్వన్ - అంజలి - గౌతమ్ మీనన్ - రేవతి - ప్రయాగా మార్టిన్ - డిల్లీ గణేష్ - రోహిణి - యోగిబాబు - అదితి బాలన్ - శ్రీరామ్ - రిత్విక - అభినయశ్రీ - అధర్వ మురళి - రోబో శంకర్‌ తదితరులు ఈ ఆంథాల‌జీ సిరీస్ లో కనిపిస్తున్నారు. కోలీవుడ్ స్టార్స్ అంతా ఒకే స్క్రీన్ పై కనిపించడం కొత్త అనుభూతిని ఇస్తోంది. అందరి లుక్స్‌ కొత్తగా ఉండటంతో పాటుగా ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తుంది.

'గిటార్ కంబి మేలే నిండ్రు' 'పాయసం' 'సమ్మర్ ఆఫ్ 92' 'ఎథిరి' 'శాంతి' 'రౌద్రమ్' 'ప్రాజెక్ట్ అగ్ని' 'ఇన్మై' 'తునింత పిన్' వంటి తొమ్మిది ఎపిసోడ్స్ గా ''నవరస'' సిరీస్ అందుబాటులోకి రానుంది. వీటిని ప్రియదర్శన్ - గౌతమ్ మీనన్ - వసంత్ - కార్తీక్ సుబ్బరాజ్ - అరవింద్ స్వామి - సర్జున్ - కార్తిక్ నరేన్ - బెయోజ్ నంబియార్ - ఆర్.ఆర్ ప్రసాద్ వంటి సృజనాత్మక దర్శకులు తెరకెక్కించారు. కరోనా కారణంగా ఇబ్బందులు ప‌డుతున్న తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యంగా ''నవరస'' సిరీస్‌ ని రూపొందించారు. స్టార్ నటీనటులు - టాప్ టెక్నిషియన్స్ కలిసి తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా తొమ్మిది భావోద్వేగాలతో తీసిన 'న‌వ‌ర‌స‌' వెబ్ వరల్డ్ లో ఎలాంటి నూతన ఒరవడిని సృష్టిస్తుందో చూడాలి.