Begin typing your search above and press return to search.

నాటీ సుంద‌రం..మైటీ లీల క్రేజీగా ఉన్నారే!

By:  Tupaki Desk   |   18 April 2022 5:50 AM GMT
నాటీ సుంద‌రం..మైటీ లీల క్రేజీగా ఉన్నారే!
X
నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో 'అంటే సుంద‌రానికి' చిత్రం తెర‌కెక్కుతోన్న‌సంగ‌తి తెలిసిందే. ఇందులో సుంద‌రానికి జోడీగా మ‌ల‌యాళం బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ న‌టిస్తుంది. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఇందులో నాని బ్రాహ్మ‌ణ యువ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. హైద‌రాబాద్ లో ని ఓ పాతకాల‌పు ఇంటి సెట్లోనే స‌గం షూటింగ్ పూర్తిచేసారు. 90 ఏళ్ల కాలం ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఇంటికి మేకోవ‌ర్ చేసి కీల‌క‌ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

నాని స‌హా సినిమాలో కీల‌క‌మైన న‌టీన‌టుల‌పై ఆ ఇంట్లోనే స‌న్నివేశాలు చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ద‌శ‌ల వారీగా ఇదే ఇంట్లో షూటింగ్ చేసారు. అంటే సుంద‌రం ఎంత పాత మ‌నిషిగా క‌నిపిస్తాడో ఊహించొచ్చు. 90 ఏళ్ల నాటి సుంద‌రాన్ని తెర‌పై 2022లో చూడ‌బోతున్నామ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. తాజాగా సినిమాకి సంబంధ‌ఙంచిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ ఈనెల 20న 11 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్ తో అధికారికంగా ప్ర‌కటించారు.

ఈ కొత్త పోస్ట‌ర్ లో నాని..న‌జ్రియా ఆద్యంతం ఫ‌న్ లుక్ లో ఆక‌ట్టుకుంటున్నారు. నాని తెల్ల పంచె..ష‌ర్ట్ ద‌రించగా. న‌జ్రియా ఎర్రీ చీర‌..రైక‌..త‌ల‌లో మ‌ల్లెపూలతో ఆక‌ట్టుకుంటుంది. రేబాన్ క‌ళ్ల‌ద్దాలు ధ‌రించిది. నాని కొంగి లాగి స‌ర‌స‌మాడుతుంటే న‌జ్రియా నోరెళ్ల‌బెట్టి నాని వీవుపై వాలిపోయింది. నాని ముఖంలో న‌వ్వు..ఉత్సాహం ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. మొత్తానికి సుంద‌రం మామూలుడు కాద‌నిపిస్తున్నాడు.

మరో పోస్ట‌ర్ లో ఇద్ద‌ర్నీ డిజైన‌ర్ దుస్తుల్లో హైలైట్ చేసారు. నాని షూట్..బూటు ధ‌రించ‌గా... న‌జ్రియా వైట్ క‌ల‌ర్ లెహంగా దుస్తుల్లో మెరిసిపోతుంది. ఇదో ర‌క‌మైన ఫ‌న్ లుక్ లా అనిపిస్తుంది.

టీజ‌ర్ రిలీజ్ అనంత‌రం సుంద‌రం..న‌జ్రియా పాత్ర‌లు ఎలా ఉంటాయి? అన్న‌ది క్లారిటీ వ‌స్తుంది. ''మీట్ అవ‌ర్ నాటీ సుంద‌రం...మైటీ లీల‌'' అంటూ టీజ‌ర్ పోస్ట‌ర్ తోనే పాత్ర‌ల స్వభ‌వాన్ని రివీల్ చేసారు. రెండు పాత్ర‌లు ఆద్యంతం స‌ర‌ద‌గా సాగేవిగా క‌నిపిస్తున్నాయి.

మ‌రి ఆ ప్ర‌త్యేక‌త ఎంత స‌ర్ ప్రైజ్ గా ఉటుందో తెలియాలంటే జూన్ 10 వ‌ర‌కూ వెయిట్చేయాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రోమో కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రీ అందిస్తున్నారు. హ‌ర్ష వ‌ర్ధ‌న్ ..సుహాస్..రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌ర న‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.