Begin typing your search above and press return to search.

మరో స్పోర్ట్స్ డ్రామా వైపు నేచురల్ స్టార్..?

By:  Tupaki Desk   |   22 May 2021 6:07 AM GMT
మరో స్పోర్ట్స్ డ్రామా వైపు నేచురల్ స్టార్..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజురోజుకి కొత్త మార్పులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటివరకు బయోపిక్స్ అంటే ఆసక్తి కనబరిచిన ప్రేక్షకులు ఇప్పుడు కొత్తగా ఎలాంటి కంటెంట్ వచ్చినా ఇట్టే స్వీకరిస్తున్నారు. అయితే కొంతకాలంగా బయోపిక్స్ తో పాటు సినీఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అయితే ఈ బయోపిక్స్ - స్పోర్ట్స్ డ్రామాలు ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే రూపొందుతున్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్స్ గురించి పక్కనపెడితే స్పోర్ట్స్ డ్రామాలు బాగానే వస్తున్నాయి. కనీసం సంవత్సరానికి ఒకటైన క్రీడానేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. అయితే ఈసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతవరకు తెరకెక్కని గేమ్ నేపథ్యంలో సినిమా రాబోతుందని సమాచారం.

తెలుగులో ఇప్పటివరకు క్రికెట్ - కబడ్డీ - బాక్సింగ్ నేపథ్యంలో ఎక్కువ సినిమాకు వచ్చాయి. అలాగే ఇటీవలే హాకీ నేపథ్యంలో కూడా ఓ సినిమా వచ్చింది. అయితే తాజాగా మరో క్రీడా నేపథ్యం కలిగిన సినిమాకు నేచురల్ స్టార్ నాని ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు నాని పాతిక సినిమాలు చేసాడు. అందులో కబడ్డీ - క్రికెట్ నేపథ్యంలో సినిమాలు చేసేసాడు. కానీ ఇప్పుడు త్వరలోనే నాని ఫుట్ బాల్ నేపథ్యంలో సినిమా చేయనున్నట్లు టాక్. ఇప్పటికే ఓ అప్ కమింగ్ డైరెక్టర్ స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో గాని సోషల్ మీడియాలో మాత్రం నాని ఫుట్ బాల్ బాక్గ్రౌండ్ మూవీ చేయనున్నట్లు కథనాలు చెబుతున్నాయి.

ఇటీవలే నాని నటిచ్చిన జెర్సీ మూవీకి రెండు నేషనల్ అవార్డులు వరించాయి. ఈ ఆనందంలో నాని ఈ ఫుట్ బాల్ నేపథ్యంలో స్క్రిప్ట్ ఓకే చేసేసినట్లు తెలుస్తుంది. నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే పీరియడిక్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. కానీ మరో విషయం ఏంటంటే.. నాని ప్రస్తుతం ఆల్రెడీ విడుదలకు సిద్ధం చేసిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ గురించి వెయిట్ చేస్తున్నాడట. మరి ఓవైపు కరోనా మహమ్మారి ఎప్పుడు తొలగిపోతుందో అని వెయిట్ చేస్తున్నారు. ఇదేగాక ఆల్రెడీ నాని చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయట. శ్యామ్ సింగరాయ్ అనంతరం నాని 'అంటే సుందరానికి' అనే సినిమా కూడా చేయనున్నాడు. మొత్తానికి నాని ఏడాదిలో అసలు ఖాళీ అనేసరికి అవసరం లేదు. అందుకే ఎల్లప్పుడూ షూటింగ్స్ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి సినిమాలు షూటింగ్స్ ఆగిపోయాయి. మళ్లీ రిలీజ్ ఎప్పుడు అవుతుందో అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.