Begin typing your search above and press return to search.

మరో స్పోర్ట్స్ డ్రామా వైపు నేచురల్ స్టార్.. దృష్టిపెట్టాడా..??

By:  Tupaki Desk   |   20 May 2021 9:38 AM GMT
మరో స్పోర్ట్స్ డ్రామా వైపు నేచురల్ స్టార్.. దృష్టిపెట్టాడా..??
X
తెలుగు హీరో నేచురల్ స్టార్ నాని ప్రధానపాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ 2019లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయితే ఈ ఏడాది 2019 సంవత్సరానికి గాను 'బెస్ట్ తెలుగు ఫిల్మ్'గా నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది జెర్సీ. అలాగే బెస్ట్ ఎడిటర్ కేటగిరిలో కూడా జెర్సీ నేషనల్ అవార్డు ఖాతాలో వేసుకుంది. అయితే జెర్సీ అనేది కమర్షియల్ గా ఎలా ఆడింది.. కలెక్షన్స్ ఎలా రాబట్టింది.. అనేదానికంటే ఎంతలా ప్రేక్షకులను చేరింది అనేది పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. అలాంటి సినిమాల్లో ఒకటిగా జెర్సీ సినిమా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని జీవించేసాడనే చెప్పాలి.

ఓ ఫెయిల్యూర్ గా ఆ ఎమోషన్స్, ఫ్యామిలీ సన్నివేశాలు మనసులకు హత్తుకునే విధంగా చూపించాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమాతో శ్రద్దాశ్రీనాథ్ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమైంది. అయితే అన్నివిధాలా జెర్సీ ఓ క్లాసిక్ మూవీ అనిపించుకుంది. జెర్సీ సినిమాతో నాని పేరు మరింత సూపర్ క్రేజ్ పెంచుకున్నాడు. అదే విధంగా ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అదే పేరుతో రీమేక్ అవుతోంది. ఒరిజినల్ డైరెక్టర్ గౌతమ్ బాలీవుడ్ రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ రీమేక్ లో షాహిద్ కపూర్, మృనాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా హీరో నాని గురించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఏంటంటే.. ప్రస్తుతం నాని చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. పీరియడిక్ మూవీ శ్యామ్ సింగరాయ్ తో పాటు అంటే సుందరానికి అనే సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఆ సినిమాలే కంప్లీట్ చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. నాని మరో స్పోర్ట్స్ డ్రామా మూవీ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అదికూడా క్రికెట్ గురించి కాదు. ఫుట్ బాల్ నేపథ్యంలో ఓ సినిమా గురించి చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలు స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చాయి కానీ ఫుట్ బాల్ నేపథ్యంలో సినిమా రాలేదని అందుకే ఇప్పుడు నాని ఆ జానర్ పై మళ్లీ కన్నేసినట్లు ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్ లో ఆల్రెడీ మైదాన్ పేరుతో ఓ సినిమా రూపొందుతుంది. ఆ సినిమా బేస్ చేసుకొని నాని ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ సినిమా పై రెస్పాన్స్ రానుందేమో!