Begin typing your search above and press return to search.

అమ్మ ఆర్టీసీ బస్సులో ఆఫీస్ ‌కి వెళ్లేది... నాని ఎమోష‌న్‌..!!

By:  Tupaki Desk   |   15 Oct 2020 10:45 AM IST
అమ్మ ఆర్టీసీ బస్సులో ఆఫీస్ ‌కి వెళ్లేది... నాని ఎమోష‌న్‌..!!
X
నేచుర‌ల్ స్టార్ నాని పేరుకు త‌గ్గ‌ట్టు ఏది చేసినా నేచుర‌లే. సినిమాల్లోనే కాదు వెండితెర‌పై కూడా అదే పంథాను కొన‌సాగిస్తూ నేచుర‌ల్ స్టార్ అనిపించుకున్నారు. హీరోగా త‌ను ఎంత ఎదిగినా ఆ క్రెడిట్ మొత్తం త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికే చెందుతుంద‌ని విన‌మ్రంగా అంటాడు. త‌న ప్యాష‌న్ ని ముందు గుర్తించిందే ఆవిడ‌ట‌. సినీ రంగంలో ఎద‌గ‌డానికి ఆమె నానిని ఎంత‌గానో ప్రోత్స‌హించార‌ట‌. ఆ విష‌యాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేసుకుంటుంటాడీ యంగ్ హీరో.

చాలా సంద‌ర్భాల్లో త‌ను ఎంచుకుంటున్న పాత్ర‌ల‌పై త‌న‌ త‌ల్లి ప్ర‌భావం వుంటుంద‌ని వెల్ల‌డించాడు కూడా. ఈ నెల 14న నేచుర‌ల్ స్టార్ నాని త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి పుట్టిన కోజు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆమె పుట్టినరోజున ఆశీర్వాదం కోరుతూ నాని త‌ల్లి పాదాలకి న‌మ‌స్క‌రించాడు. ఆ ఫొటోని ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు.

భారతీయ సాంప్రదాయ పద్ధతిని అనుసరించి నాని త‌ల్లి పుట్టినరోజున ఆమె పాదాలను తాకి `పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ` అని ఆ ఫొటోకి క్యాప్ష‌న్ ఇచ్చాడు. నాని తల్లి ఏడాది క్రితం వరకు వైజాగ్ ‌లో పనిచేసేది అంతే కాకుండా ఆర్టీసీ బస్సులో ఆఫీస్ ‌కి వెళ్లేది. తన కొడుకు విజయవంతమైన సినీ నటుడు అయిన తరువాత కూడా ఆమె వైజాగ్ లో అత్యంత సాధార‌ణ‌మైన మధ్యతరగతి జీవితాన్ని గడిపారు. ఇప్పుడు నాని పెద్ద హీరో అయ్యి త‌న త‌ల్లిదండ్రుల‌ను భార్యా పిల్ల‌ల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు.