Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్‌ తెలంగాణ పాఠాలు

By:  Tupaki Desk   |   22 Jan 2022 6:30 AM GMT
నేచుర‌ల్ స్టార్‌ తెలంగాణ పాఠాలు
X
నేచుర‌ల్ స్టార్ నాని రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `శ్యామ్ సింగ రాయ్‌`. రాహుల్ సంక్రీత్య‌న్ అత్య‌తం ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నాలుగు భాష‌ల్లోనూ అనూహ్య విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా హీరోగా నానికి మంచి పేరుని తెచ్చిపెట్టింది.

కోల్ క‌తా నేప‌థ్యంలో సాగే టైమ్ ట్రావెల్ స్టోరీగా స‌రికొత్త అనుభూతిని అందించిన ఈ మూవీపై స‌ర్వ‌త్ర ప్ర‌శంస‌లు ల‌భించిన విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్ర బృందాన్ని ప్ర‌త్యేకంగా అభినందించారు.

నాని, సాయి ప‌ల్ల‌విల న‌ట‌న ఈ చిత్రానికి దిబెస్ట్ అని కితాబిచ్చారు కూడా. తాజాగా మెగాస్టార్ కూడా స్వ‌యంగా ఈ మూవీ చూసి నేచుర‌ల్ స్టార్ నానిని తేనీటి విందుకు ఆహ్వానించ‌డం, స‌తీస‌మేతంగా అత‌నితో క‌లిసి ముచ్చ‌టించ‌డం, ఇందుకు సంబంధించిన ఓ వీడియోని మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం తెలిసిందే.

ఈ మూవీ స‌క్సెస్ తో మాంచి జోష్ మీదున్న హీరో నాని అదే జోష్ తో త‌న కొత్త చిత్రానికి రెడీ అయిపోతున్నాడు.

నాని న‌టిస్తున్న తాజా చిత్రం `అంటే.. సుంద‌రానికి`. వీవేక్ ఆత్రేయ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ జ‌రుపుకుంటోంది. అన్నీ క‌రెక్ట్ గా ఫినిష్ చేసి చిత్రాన్ని స‌మ్మ‌ర్ కు రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ పూర్త‌యిన వెంట‌నే నాని త‌న త‌దుప‌రి చిత్రం `ద‌స‌రా`ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్, టైటిల్ డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్‌ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ టీజ‌ర్ లో నాని తెలంగాణ యాస‌లో చెప్పిన డైలాగ్ లు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకున్నాయి. జ‌మ్మి పెట్టి చెబుతున్నా.. అంటూ తెలంగాణ యాస‌లో నాని చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లు సినీ ప్రియుల్ని స‌ర్‌ప్రైజ్ చేశాయి.

దీన్ని బ‌ట్టి ఇందులో నాని తెలంగాణ యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నార‌ని స్ప‌ష్ట‌మైంది.

ప్ర‌స్తుతం ఈ పాత్ర కోసం నాని తెలంగాణ యాస‌ని నేర్చుకుంటున్నార‌ని తెలిసింది. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఓ ట్యూట‌ర్ ని నియ‌మించుకుని స్లాంగ్ పై ప‌ట్టుసాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. `ద‌స‌రా` తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఇంత వ‌రకు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని స‌రికొత్త క‌థ‌తో తెర‌పైకి రాబోతోంది.

దీంతో ఈ చిత్రాన్ని చాలా ప్ర‌త్యేకంగా తీసుకున్న నాని ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌టం లేద‌ట‌. ఇందులో నానికి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది.