Begin typing your search above and press return to search.

వింటేజ్ లుక్ లో నాచురల్ స్టార్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   21 Nov 2021 8:38 AM GMT
వింటేజ్ లుక్ లో నాచురల్ స్టార్ అదుర్స్‌
X
నాని తాను చేసిన ప్రతి సినిమాను కూడా ప్రాణం పెట్టి చేస్తాడు అంటూ అభిమానులు నమ్ముతూ ఉంటాడు. ఆయన ఏ పాత్రను చేసినా కూడా ఆ సినిమా లో ఆ పాత్ర కనిపిస్తుంది కాని నాని ఎక్కడ కనిపించడు. నాని ఒక అద్బుతమైన నటుడు అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన్ను అభిమానులు నాచురల్‌ స్టార్ నాని అంటారు. ఏ పాత్రలో అయినా ఒదిగి పోయి నటించడం ఆయనకే చెల్లుతుంది.

ఇక ఆయన పాత్రల పరకాయం చేసే సమయంలో ఆ పాత్ర గెటప్ ను కూడా చాలా చక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు. ఇప్పుడు శ్యామ్‌ సింగ రాయ్ సినిమా తో నాని మరో సారి తన ప్రతిభ ను చూపించబోతున్నాడు. సినిమా లో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు కనుక అభిమానులకు డబుల్‌ ధమాకా ఖాయం అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

శ్యామ్‌ సింగరాయ్ సినిమాలో హీరోగా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న నాని రెండు పాత్రలను కూడా జీవించేసి ఉంటాడు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. శ్యామ్‌ సింగరాయ్ సినిమా లోని బెంగాళి ఎపిసోడ్‌ సినిమా కు ప్రథాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. అందులోనే నాని వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడు.

జర్నలిస్ట్‌ గా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన పోరాటం చేసే వ్యక్తిగా నాని కనిపించబోతున్నాడు. నాని ఇప్పటికే ఆ లుక్ ను రివీల్ చేశాడు. తాజాగా ఆ పాత్రకు సంబంధించి ఈ ఫొటోను షేర్‌ చేసిన నాని సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నాడు.

వచ్చే నెల చివర్లో విడుదల కాబోతున్న నాని శ్యామ్‌ సింగరాయ్ ప్రమోషన్ లో భాగంగా నాని షేర్‌ చేసిన ఈ పిక్ ను అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు. వింటేజ్ లుక్ లో నాచురల్‌ స్టార్ నాని చాలా నాచురల్ గా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

వింటేజ్‌ లుక్ ను కూడా అద్బుతంగా చూపించగల సత్తా కేవలం నాచురల్ స్టార్ కు మాత్రమే దక్కింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్‌ అవుతోంది. వరుసగా నాని సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రాబోతున్నాయి. గత రెండు సినిమా లు ఓటీటీ ద్వారా విడుదల అవ్వడంతో బాక్సాఫీస్ హడావుడి మిస్ అయ్యింది. అందుకే శ్యామ్‌ సింగ రాయ్ తర్వాత వరుసగా సినిమాలు రాబోతున్నట్లుగా చెబుతున్నారు.