Begin typing your search above and press return to search.

ర‌వితేజ‌- శ్రీ‌కాంత్ త‌ర్వాత స్వ‌యంకృషితో ఎదిగిన హీరో

By:  Tupaki Desk   |   5 Sep 2021 12:30 PM GMT
ర‌వితేజ‌- శ్రీ‌కాంత్ త‌ర్వాత స్వ‌యంకృషితో ఎదిగిన హీరో
X
నేచుర‌ల్ స్టార్ నాని ఎలాంటి సినీ నేప‌థ్యం లేకుండానే ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా మొద‌లై.. ఇంతింతై వంటుడింతై అన్న‌ చందంగా ఎదిగారు. చిన్న హీరోగా మొద‌లైన ఆయ‌న ప్ర‌యాణం నేడు స్టార్ హీరోగా కొన‌సాగుతోంది. టాలీవుడ్ టాప్ యంగ్ హీరోల‌లో నాని ఒక‌రు. మెగాస్టార్ చిరంజీవి...మాస్ రాజా ర‌వితేజ.. హీరో శ్రీ‌కాంత్ త‌ర్వాత స్వ‌యంకృషితో ఎదిగిన హీరోగా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది నాని ఒక్క‌డే. సాక్షాత్తు మెగాస్టార్ నాని ఎదుగుద‌ల సినీ ప్ర‌వేశం గురించి ఓ సంద‌ర్భంలో మాట్లాడి న వైనం స్ఫూర్తి నింపింది. ఓ వైపు న‌ట‌వార‌సులు రాజ్య‌మేలుతోన్న సామ్రాజ్యంలో నాని కూడా వ‌రుస విజ‌యాల‌తో స‌త్తా చాటుతూ ఒడిదుడుకుల‌ను అధిగ‌మించి అంద‌రిలో నేను ఒక‌డిని అంటూ ఓ ఐడెంటీని కాంపిటీష‌న్ న‌డుమ ద‌క్కించుకున్నారు. నేడు టాలీవుడ్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ పేజీని రాసిపెట్టారు. ఆయ‌న ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చి నేటికి 13 ఏళ్లు పూర్త‌యింది. నేచుర‌ల్ స్టార్ న‌టించిన తొలి చిత్రం `ఆష్టాచెమ్మా ` విడుద‌లై 13 ఏళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా నాని జ‌ర్నీపై ప్ర‌త్యేక క‌థ‌నం...

నాని తొలుత ద‌ర్శ‌కుడు కాక‌ముందు ప‌లు సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసారు. ఆ త‌ర్వాత సీనియ‌ర్ ద‌ర్శ‌కులు బాపు వ‌ద్ద ఓ సినిమాకు అసిస్టెంట్ గా ప‌నిచేసారు. ఆ క్ర‌మంలోనే నాని ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ క‌ళ్ల‌లో ప‌డ్డారు. నాని-అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా `అష్టాచెమ్మా` సినిమా తెర‌కెక్కించారు. ప‌రిమిత బ‌డ్జెట్ లో కంటెంట్ బేస్ట్ గా తెర‌కెక్కిన ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ స‌క్సెస్ నాని కెరీర్ కి పూల‌బాట వేసింది. ఆ వెంట‌నే `రైడ్`..`స్నేహితుడా`..`భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు` లాంటి చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ ని అందించాయి. దీంతో నాని కెరీర్ వెన‌క్కి తిరిగి చూడాల్సిన ప‌నిలేకుండా సాగిపోయింది.

`పిల్ల జ‌మీంద‌ర్` సక్సెస్ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నాని తో `ఈగ` లాంటి టెక్నిక‌ల్ నేప‌థ్యమున్న సినిమా తెర‌కెక్కించి నాని క్రేజ్ ని రెట్టింపు చేసారు. తెలుగు.. త‌మిళ్ లో ఆ సినిమా మంచి స‌క్సెస్ ని అందుకుంది. దీంతో నాని కి జాతీయ‌..అంత‌ర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ద‌క్కింది. అటుపై కొన్ని ప‌రాజ‌యాలు ఎదుర్కున్నా `భ‌లే భ‌లే మ‌గ‌డివోయ్`..`. `నేను లోక‌ల్`.. నిన్నుకోరి..`మిడిల్ క్లాస్ అబ్బాయ్`..`.జెర్సీ` లాంటి విజ‌యాలు నాని పుంజుకునేలా చేసాయి.

`అ ` సినిమాతో నిర్మాత‌గా అడుగు పెట్టారు. న‌వ‌త‌రం ప్ర‌తిభ‌ను వెలికితీసే ప్ర‌య‌త్నంగా ప్రొడ‌క్ష‌న్ లోకి దిగారు. కానీ యాక్టివ్ గా సినిమాలు నిర్మించ‌లేదు. కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలైతే చేయ‌లేదు. ప్రస్తుతం నాని న‌టించిన `ట‌క్ జ‌గ‌దీష్` చిత్రం ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే ` శ్యాంసింఘ‌రాయ్`..`అంటే సుంద‌రానికి` అనే రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. మొత్తంగా నాని 13 ఏళ్ల ప్రస్థానంలో 40 సినిమాల‌కు పైనే చేసారు. నాని ఇంత పెద్ద స్థాయికి ఎదగ‌డానికి అత‌డి మాట కారిత‌నం క‌మ్యూనికేష‌న్ విధానం ప‌క్కింటి కుర్రాడిగా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకునే త‌త్వం ఒదిగి ఉండే స్వ‌భావం ఇలా చెప్పుకుంటూ వెళితే అత‌డిలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ని గ‌మ‌నించ‌వ‌చ్చు. నాని త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి వైబ్రేంట్ క్వాలిటీస్ తో నిఖిల్ - విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోలు కెరీర్ ప‌రంగా దూసుకెళుతున్నారు.