Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ టీమ్ ఇబ్బంది ప‌డిందా?

By:  Tupaki Desk   |   14 April 2022 2:30 AM GMT
నేచుర‌ల్ స్టార్ టీమ్ ఇబ్బంది ప‌డిందా?
X
నేచుర‌ల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం డెబ్యూ శరత్ దర్శకత్వంలో ద‌స‌రా సెట్స్ పై ఉంది. గోదావరిఖని ప్రాంతంలో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ఓ పాటను రూపొందిస్తున్నారు. అయితే ఆన్ ద స్పాట్ ఆశించిన సౌక‌ర్యాలు అందుబాటులో లేవు. గోదావరిఖని చాలా చిన్న పట్టణం కావ‌డంతో లొకేష‌న్ లోని 500 మంది డ్యాన్సర్ లతో పాటు జూనియర్ ఆర్టిస్టులకు వసతి కల్పించడానికి ఆ ప్లేస్ లో అనుకూల‌త క‌ల‌గ‌లేద‌ట‌.

చిన్న ప‌ట్ట‌ణంలో ఆశించిన అతిథి గృహాలు.. హోట‌ళ్లు ఉండ‌వు. స‌ర్ధుబాటు కోసం  ప్రభుత్వ అతిథి గృహాలు.. ఇత‌ర సంస్థ‌ల ఖాళీ స్థ‌లాల‌ను బుక్ చేసి అక్కడ కొందరిని పడుకోబెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. కల్యాణ మండపాలకు కూడా కొంద‌రిని తీసుకెళ్లాల్సొచ్చింద‌ట‌. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మాత్రమే కాదు.. సౌక‌ర్యాలు ఆశించిన స్థాయిలో ఏర్పాటు చేయ‌డం చాలా క‌ష్టం. ఇంత చిన్న పట్టణంలో ఇంత భారీ సమావేశాన్ని నిర్వహించడం చాలా కష్టమైన పని.

ఇక ఈ మూవీ కోసం నానీ చాలా శ్ర‌మిస్తున్నాడు. ఇటీవ‌ల త‌న‌కు ద‌క్క‌ని మాస్ హిట్ ని కొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. మాస్ హీరో అన్న ట్యాగ్ కూడా ఇటీవ‌ల మిస్స‌వుతోంది. దానిని తిరిగి తెచ్చుకునే ప్ర‌య‌త్న‌మిద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం పెద్ద బ‌డ్జెట్ ని పెడుతున్నారు. నిర్మాత‌ల‌కు ఇప్ప‌టికే బోలెడంత సెగ తాకుతోంది.