Begin typing your search above and press return to search.

'దసరా' అప్డేట్: బొగ్గు గనుల్లో బీడీ తాగుతూ.. ఊర మాస్ అవతార్‌ లో నాని..!

By:  Tupaki Desk   |   1 July 2022 12:30 PM GMT
దసరా అప్డేట్: బొగ్గు గనుల్లో బీడీ తాగుతూ.. ఊర మాస్ అవతార్‌ లో నాని..!
X
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''దసరా''. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను పునఃప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు.

'దసరా' సినిమా కోసం హైదరాబాద్‌ పరిసరాల్లో భారీ సెట్‌ ను నిర్మించారు. ఈ ప్రత్యేకమైన సెట్ లోనే తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. సుదీర్ఘమైన ఈ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు

ఈ సినిమాలో నాని ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి మాస్ రోల్‌ లో నటిస్తున్నారు. చింపిరి జుట్టు మరియు గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌ లో కనిపించనున్నారు. అంతేకాదు తొలిసారిగా ఈ సినిమా కోసం తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.

ఇప్పటికే విడుదలైన స్పార్క్ ఆఫ్ దసరా గ్లింప్స్‌ కి అద్భుతమైన స్పందన లభించింది. నాని మాస్ గెటప్ మరియు భయంకరమైన అవతార్ వీక్షకులను ఆశ్చర్యపరిచింది. తాజాగా 'దసరా' సినిమా నుంచి సరికొత్త పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

ఈ స్టిల్‌ లో నాని లుంగీ మరియు బనియన్‌ లలో అవుట్ అండ్ అవుట్ రూరల్ మాస్ అవతార్‌ లో కనిపిస్తున్నాడు. బొగ్గు గనిపై నిలబడి బీడీ తాగడాన్ని ఇందులో గమనించవచ్చు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.

'దసరా' అనేది నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. హయ్యెస్ట్ బడ్జెట్ తో భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో నాని సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని - సాయి కుమార్ మరియు జరీనా వహాబ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

దసరా చివరి షెడ్యూల్‌ లో స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ ని చిత్రీకరించారు. అంతకు ముందు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో నాని - కీర్తి సురేష్‌ లపై ఓ పాట చిత్రీకరించారు.

సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్‌ నూలి ఎడిటర్‌ గా.. అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్ చేస్తున్నారు. 'దసరా' సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.