Begin typing your search above and press return to search.

బుజ్జి నాని గాడు నేచుర‌ల్ ఆగ‌డాలు

By:  Tupaki Desk   |   2 Sep 2019 4:39 AM GMT
బుజ్జి నాని గాడు నేచుర‌ల్ ఆగ‌డాలు
X
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! ... నేచుర‌ల్ స్టార్ నాని వార‌సుడిని చూస్తుంటే చాలా వేగంగా ఎదిగేస్తున్నాడా? అనిపిస్తోంది. ఇక నేచురల్ బాల‌న‌టుడు అవుతాడేమో చూడాల‌న్న ఉత్సాహం అభిమానుల్లో పెరుగుతోంది. `జ‌నులా సుపుత్రుని క‌నుగొని పొగిడే సంద‌ర్భం` ఇంకెంతో దూరంలో లేదేమో! తండ్రిని మించిన సుపుత్రుడు అనిపిస్తాడా ఈ చిన్నారి బాల‌కుడు? ప‌్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

ఓవైపు `గ్యాంగ్ లీడ‌ర్` రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది కాబ‌ట్టి నాని పూర్తి బిజీ. ఇర‌వై రోజులుగా బుజ్జి నానిగాడితో ఆడుకునే స‌మ‌య‌మే చిక్క‌లేద‌ట‌. అయినా నాని భార్య అంజ‌న ఎల‌వ‌ర్తి ఇదిగో ఈ క్యూట్ వీడియోని అభిమానుల‌కోసం ఇన్ స్టా వాల్ పై ఉంచ‌డంతో చాలా విష‌యాలు అభిమానుల‌కు అర్థ‌మ‌య్యాయి. సుపుత్రుడితో నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌తి క్ష‌ణాన్ని ఒక సెల‌బ్రేష‌న్ లా ఫీల‌వుతుంటార‌న‌డానికి ఇంత‌కంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి. విదేశాల్లోని ఓ రెస్టారెంట్ లో ఇలా క్యూట్ కిడ్ బుజ్జి నానిగాడితో అలా స‌ర‌దా స‌ర‌దాగా టైమ్ పాస్ చేస్తున్నారు. నాని చేతుల్లోనే బుల్లి నేచుర‌ల్ స్టార్ ఒదిగిపోయి చిలౌట్ చేస్తున్నాడు. జూనియ‌ర్ నేచుర‌ల్ స్టార్ న‌వ్వు సంథింగ్ స్పెష‌ల్. ఏ డాడ్ కి అయినా ఇలాంటి సంద‌ర్భం ఎంతో ఆనందాన్నిస్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఈనెల 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా `గ్యాంగ్ లీడ‌ర్` చిత్రం థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే 20 రోజులుగా నాని ఫుల్ బిజీగా ఉండ‌డంతో ఫ్యామిలీతో స‌మ‌యం గ‌డ‌ప‌లేక‌పోయార‌ట‌. ఇక‌పై రిలీజ్ ప్ర‌మోష‌న్స్ తో పూర్తి బిజీ అయిపోతారు కాబ‌ట్టి అస‌లే ఇంటికి చిక్క‌రు. గ్యాంగ్ లీడ‌ర్ టీజ‌ర్- ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. ఇదో చ‌క్క‌ని ఫ‌న్నీ ఎంట‌ర్ టైన‌ర్ అని అర్థ‌మ‌వుతోంది. విక్ర‌మ్ కె- నాని బృందం ఈ సినిమా విజ‌యంపై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అభిమానుల అంచ‌నాల్ని గ్యాంగ్ లీడ‌ర్ అందుకుంటుందా అన్న‌ది చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి