Begin typing your search above and press return to search.

పిక్ టాక్: వర్కవుట్స్ లేని నేచురల్ నాని జిమ్..!

By:  Tupaki Desk   |   7 Jan 2022 2:30 AM GMT
పిక్ టాక్: వర్కవుట్స్ లేని నేచురల్ నాని జిమ్..!
X
నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఇటీవల 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో పలకరించిన నాని.. ప్రస్తుతం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అలానే ఫిట్‌ నెస్ మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

జిమ్ లో వర్కవుట్స్ కు ముందు తన ఐఫోన్ లో తీసుకున్న ఓ మిర్రర్ సెల్ఫీ ఫోటోని నాని గురువారం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. 'జిమ్‌ లో ఉన్నప్పుడు, వర్కవుట్ చేయడం తప్ప అన్నీ చేయండి' అనే క్యాప్షన్ జోడించారు నాని. ప్రస్తుతం నాని జిమ్ సెల్ఫీ నెట్టింట సందడి చేస్తోంది.

నిజానికి తొలి సినిమా 'అష్టాచమ్మ' నుంచి ఇప్పటి వరకు స్టైలింగ్ - ఫిజిక్ పరంగా నాని పెద్దగా మేకోవర్ అవ్వలేదు. ఎలాంటి పాత్ర అయినా తన హెయిర్ స్టైల్ లో కాస్త వైవిధ్యం చూపిస్తూ.. తన నటనతో పాత్రను పండిస్తూ వచ్చారు. తాను జిమ్ పర్సన్ కాదని.. బాడీ బిల్డింగ్ అంటే అంతగా ఇష్టపడనని నాని గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు.

కానీ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తానని అన్నారు. ఇప్పటి వరకు తను చేసిన పక్కింటి అబ్బాయి తరహా పాత్రలకు బాడీ చూపించాల్సిన అవసరం లేనందున నాని దాని గురించి ఆలోచించలేదని అర్థం అవుతోంది. కాకపోతే ఇటీవల 'శ్యామ్ సింగరాయ్' సినిమా కోసం గెటప్ వైజ్ కాస్త వేరియేషన్ చూపించాడు.

అయితే ఇప్పుడు జిమ్ లో ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం చూస్తుంటే తదుపరి సినిమాలలో నాని కండలు తిరిగిన దేహాన్ని చూపించనున్నారేమో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించడానికి ఎప్పుడూ ముందుండే నాని వంటి పెర్ఫార్మర్‌ కు కంప్లీట్ మేకోవర్ అనేది ఖచ్చితంగా సహాయపడుతుంది.

నాని ప్రస్తుతం ''అంటే.. సుందరానికీ!'' రోమ్-కామ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నజ్రియా నజీమ్ ఫహద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో నాని పాత్ర సరికొత్తగా ఫన్నీగా ఉండబోతోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అలానే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ''దసరా'' అనే సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ డ్రామాగా రెడీ చేస్తున్నారని టాక్. ఇందులో నాని ఒక గజదొంగగా.. ఇప్పటి వరకు కనిపించని గెటప్ లో కనిపిస్తారని సమాచారం.