Begin typing your search above and press return to search.

త‌మిళ స్టార్ తో నేచుర‌ల్ స్టార్ మ‌ల్టీస్టార‌ర్‌

By:  Tupaki Desk   |   17 Dec 2021 7:42 AM GMT
త‌మిళ స్టార్ తో నేచుర‌ల్ స్టార్ మ‌ల్టీస్టార‌ర్‌
X
నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ `శ్యామ్ సింగ రాయ్‌`. రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియన్ హీరోయిన్ లుగా న‌టించారు. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో సైటిఫిక్ అంశాల్ని జోడించిన కోల్ క‌తా నేప‌థ్యంలో దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా 1970వ ద‌శ‌కం కాలంలో పోరాడిన ఓ వ్య‌క్తి క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై బోయిన ప‌ల్లి వెంక‌ట్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

నాని ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నెల 24న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ నేప‌థ్యంలో హీరో నాని, సాయి ప‌ల్ల‌వి, నిర్మాత వెంక‌ట్ బోయిన ప‌ల్లి చెన్నైలో త‌మిళ వెర్ష‌న్ ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో చిత్ర బృందంతో పాటు త‌మిళ, తెలుగు భాష‌ల్లో విల‌క్ష‌న న‌టుడుగా పేరు తెచ్చుకున్న స‌ముద్ర‌ఖ‌ని కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో నాని చెప్పిన ఓ మాట త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ అభిమానుల‌కు ఆనందాన్ని క‌లిగించింది. ఈ సంద‌ర్భంగా సినిమా గురించి మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పిన నాని `నాన్ ఈ` (ఈగ‌) స‌కెస్ తరువాత త‌మిళ స్ట్రెయిట్ మూవీని చేయాల‌ని అందుకు స‌రైన స్క్రిప్ట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా త‌మిళ ప్రేక్ష‌కులు త‌న‌ని అక్కున చేర్చుకున్నార‌ని, `శ్యామ్ సింగ రాయ్‌` క‌థ విన్న‌ప్పుడు ఈ చిత్రాన్ని త‌మిళ ప్రేక్ష‌కులు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ని అనిపించింద‌ని అందుకే ఈ చిత్రాన్ని త‌మిళంలో రిలీజ్ చేస్తున్నామ‌ని వెల్ల‌డించాడు.

త‌మిళ మీడియా అడిగిన మ‌రిన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తికర సమాధానాలు చెప్పిన నాని త‌ను మ‌ణిర‌త్నం సార్ కి వీరాభిమానిని, ఆయ‌న డైరెక్ష‌న్ లో న‌టించాల‌న్న‌ది త‌న డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు. అలాగే శివ‌కార్తికేయ్న్ తో క‌లిసి నటించాల‌ని వుంద‌ని, అది మంచి స్క్రిప్ట్ కుదిరితే త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశాడు.