Begin typing your search above and press return to search.

క్రైసిస్ లోనూ షాకిస్తున్న‌ నేచుర‌ల్ స్టార్ మార్కెట్

By:  Tupaki Desk   |   16 Dec 2020 2:00 PM IST
క్రైసిస్ లోనూ షాకిస్తున్న‌ నేచుర‌ల్ స్టార్ మార్కెట్
X
నేచుర‌ల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పాడ‌ని ప్ర‌చార‌మైంది. ఇక `టక్ జ‌గ‌దీష్` చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గానే.. శ్యామ్ సింఘ‌రాయ్ చిత్రాన్ని ప్ర‌కటించాడు. ఆ త‌ర్వాత `అంటే సుంద‌రానికి` అంటూ ఫ‌న్నీ టైటిల్ తో కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిన‌దే.

ఇంద్ర‌గంటితో `వీ` ఫ్లాపైనా నాని రేంజ్ ఎంత‌మాత్రం త‌గ్గ‌లేద‌న‌డానికి ఈ లైన‌ప్ పెద్ద ఎగ్జాంపుల్. ఇక అత‌డి మార్కెట్ రేంజు ఎలా ఉంది? అన్న‌దానికి తాజాగా లైవ్ ఎగ్జాంపుల్ క‌నిపిస్తోంది. దాదాపు 50 కోట్ల మార్క్ తో నాని సినిమాల బిజినెస్ చాలా ముందే పూర్త‌యిపోతుండ‌డం.. అది కూడా ఇంకా సెట్స్ కి వెళ్ల‌క ముందే డీల్స్ ఖాయ‌మైపోతుండ‌డం చూస్తుంటే ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేం.

నాని సినిమాల‌తో నిర్మాతలు భారీ లాభాలను ఆర్జిస్తున్నార‌న్న విశ్లేష‌ణ ప‌రిశ్ర‌మ‌లో సాగుతోంది. `టక్ జగదీష్` వ‌చ్చే వేస‌విలో రిలీజ్ కి వ‌స్తుండ‌గా.. ఈ మూవీ టోట‌ల్ హక్కులను రూ .47 కోట్లకు విక్ర‌యించార‌ని లీకులు అందాయి. అలాగే ఈ నెలలో `శ్యామ్ సింఘరాయ్` చిత్రీకరణను నాని ప్రారంభించనున్నారు. ఇది త‌న‌ కెరీర్లో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలువ‌నుంది. ఈ మూవీ త‌ర్వాత మైత్రి సంస్థ‌తో వివేక్ ఆత్రేయ చిత్రంలో న‌టించాల్సి ఉంది. ఈ రొమాంటిక్ కామెడీ ఇంకా సెట్స్ కి వెళ్ల‌కముందే జీ 5 వాళ్లు 52కోట్ల‌కు ఎ టు జ‌డ్ హ‌క్కుల‌ను చేజిక్కించుకున్నార‌న్న‌ది హాట్ టాపిక్ గా మారింది. సాయి తేజ్ `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` కి 25కోట్లు చెల్లించిన జీ5 ఇప్పుడు నానీకి ఆల్మోస్ట్ డ‌బుల్ పేమెంట్ ఇస్తోంది. ఎనిమిది నెల‌లుగా థియేట‌ర్లు తెర‌వ‌క పోయినా హీరోల క్రేజును బ‌ట్టి ఈ రేంజు మార్కెట్ సాగుతుండడం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. క్రైసిస్ ట్యాలెంటును ఆప‌లేద‌న‌డానికి ఇదో ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.