Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ ద‌స‌రా గిఫ్ట్ రెడీ

By:  Tupaki Desk   |   7 Oct 2019 5:23 AM GMT
నేచుర‌ల్ స్టార్ ద‌స‌రా గిఫ్ట్ రెడీ
X
హీరోగానే కాదు.. నిర్మాత‌గానూ సత్తా చాటుతున్నాడు నేచురల్ స్టార్ నాని. స‌క్సెస్ కి అప్పుడ‌ప్పుడు చిన్న‌పాటి బ్రేకులు ప‌డుతున్నా తిరిగి బండిని ప‌ట్టాలెక్కించ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతున్నాడు. అందుకే నానీ కెరీర్ ప‌రంగా ఎదురే లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఈ ఏడాది జెర్సీ.. నానీస్ గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాలు రిలీజ‌య్యాయి. వీటికి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కినా ఎందుక‌నో బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో అనుకున్నంత రీచ్ సాధ్య‌ప‌డ‌లేదు. తిరిగి ఇంద్రగంటి ద‌ర్శ‌క‌త్వంలోని వీ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవ్వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తున్నాడు.

ప‌నిలో ప‌నిగా సొంత బ్యాన‌ర్ లో ప్ర‌తిభావంతుల్ని ప్రోత్స‌హిస్తూ సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇంత‌కుముందు త‌న సొంత నిర్మాణ సంస్థ‌ వాల్ పోస్టర్ బ్యాన‌ర్ లో అ లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని నిర్మించి ప్ర‌శాంత్ వ‌ర్మ లాంటి ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కుడికి లైఫ్ నిచ్చాడు నాని. అ చిత్రానికి జాతీయ అవార్డ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇదే బ్యాన‌ర్ లో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే ప్రీ-ప్రొడక్షన్ పూర్త‌యింది. రెగ్యులర్ షూట్ అక్టోబర్ 25 నుండి ప్రారంభమవుతుంది. 50 పనిదినాలు.. రెండు షెడ్యూళ్ల‌లో చిత్రీకర‌ణ పూర్తి చేస్తార‌ట‌. నానీ ఫైన‌ల్ స్క్రిప్టు విని ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి నాని స్నేహితుడు ప్రశాంతి తిపిర్నేని నిర్మాణ బాధ్యతలను చేప‌డుతున్నారు. ప్రస్తుతం నాని దక్షిణ కొరియా టూర్ ముగించి నేడు హైద‌రాబాద్ కి వ‌స్తున్నార‌ని తెలుస్తోంది. తన బ్యాన‌ర్ రెండో సినిమా గురించి అధికారిక ప్రకటన ఈ దసరా సందర్భంగా వెలువ‌డ‌నుంది.