Begin typing your search above and press return to search.

హీరోయిన్ల‌నే న‌మ్ముకుంటున్న నేచుర‌ల్ హీరో!

By:  Tupaki Desk   |   28 Jun 2021 9:30 AM GMT
హీరోయిన్ల‌నే న‌మ్ముకుంటున్న నేచుర‌ల్ హీరో!
X
క‌థానాయిక‌ల‌ను న‌మ్ముకుని లేడీ సెంట్రిక్ సినిమాలు నిర్మించి బాక్సాఫీస్ హిట్ కొట్టాలంటే గ‌ట్స్ ఉండాలి. హీరోసామ్యంలో హీరోయిన్లతో బంప‌ర్ హిట్లు కొట్టాలంటే చాలా క్యాలిక్యులేష‌న్స్ ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. కానీ నేచుర‌ల్ స్టార్ నాని గ‌ట్స్ చూస్తుంటే అత‌డి సెలక్ష‌న్ విధానం చూస్తుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

అత‌డు హీరోయిన్లనే న‌మ్మి పెట్టుబ‌డి పెట్టి సినిమాలు నిర్మిస్తున్నాడు. నాని నిర్మాత‌గా వ‌చ్చిన మొద‌టి సినిమా `అ!` క‌థానాయిక‌ల‌పైనే న‌డిచే సినిమా. కాజ‌ల్- నిత్య మీన‌న్ - ఈషా రెబ్బా- రెజీనా హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అ! బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నాని లేటెస్ట్ మూవీ ``లో కూడా ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తున్నార‌ని తెలిసింది.

ఇందులో రుహాని సింగ్- అదాశ‌ర్మ - కాజ‌ల్- నివేధ థామ‌స్ న‌టిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఇంకా క‌న్ఫామ్ కావాల్సి ఉంది. బ‌హుశా తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బాను తీసుకునే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. లాజిక్ ఏదైనా కానీ నానీ క‌థ‌ల‌ సెల‌క్ష‌న్ నాయికా ప్రాధాన్య‌త ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. అత‌డి గ‌ట్స్ ని మెచ్చుకుంటున్నారంతా. అ! త‌ర‌హాలోనే అత‌డు నిర్మాత‌గా మ‌రో బంప‌ర్ హిట్ ఇస్తారేమో చూడాలి.