Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ బ్యూటీ నివేద హాట్ లుక్

By:  Tupaki Desk   |   22 Aug 2022 4:19 AM GMT
నేచుర‌ల్ బ్యూటీ నివేద హాట్ లుక్
X
చిత్ర‌ల‌హ‌రి- బ్రోచేవారెవ‌రురా లాంటి క్లాసీ హిట్స్ తో పాటు అల వైకుంఠ‌పుర‌ములో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించింది నివేద పెథురాజ్. అందానికి అందం ప్ర‌తిభ ఉన్న క‌థానాయిక‌గా టాలీవుడ్ లో పాపుల‌రైంది.

కానీ ఈ బ్యూటీ కెరీర్ ఆశించినంత దూకుడుగా సాగ‌డం లేదు. కెరీర్ ప‌రంగా సెల‌క్టివ్ గా ఉండే నివేద ఒక సినిమా త‌ర్వాత ఒక సినిమా అన్న‌ట్టుగా నెమ్మ‌దిగా ముందుకు సాగుతోంది.

ఇటీవ‌ల విడుద‌లైన విరాఠ‌ప‌ర్వంలో నివేద పోలీసాఫీస‌ర్ గా అద్భుతంగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఈ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఆహా కోసం బ్లడీ మేరీ అనే సినిమాలోనూ నివేద న‌టించింది.

ఇందులో న‌ట‌న‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. విశ్వ‌క్ తో పాగ‌ల్ లో న‌టించినా అది కూడా గుడ్ రిజ‌ల్ట్ ని ఇవ్వ‌లేదు. త‌దుప‌రి నివేద కొన్ని వెబ్ సిరీస్ ల‌పైనా దృష్టి సారిస్తోంద‌ని స‌మాచారం.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో నివేద డీసెంట్ ఫోటోషూట్స్ కి గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే నివేద సామాజిక మాధ్య‌మాల్లో నెమ్మ‌దిగానే ఉంది. కానీ మునుముందు మ‌రింత హీట్ పుట్టించే ఫోటోషూట్ల‌తో బ‌రిలో దిగనుంద‌ని టాక్ వినిపిస్తోంది.

వైట్ అండ్ వైట్ లుక్ లో నివేద తాజా ఫోటోగ్రాఫ్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోని యువ‌త‌రం వాట్సాప్ లు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా షేర్ చేస్తూ క్లిక్ ల‌తో హోరెత్తిస్తున్నారు. నివేద నేచుర‌ల్ బ్యూటీ.. అన‌వ‌స‌ర‌మైన మేక‌ప్ గ్లిజ్ తో క‌నిపించ‌దు. అందుకే త‌న అంద‌చందాల‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది.