Begin typing your search above and press return to search.
బన్నీ చెల్లెలిగా నేచురల్ బ్యూటీ..?
By: Tupaki Desk | 5 Jan 2021 12:16 PM ISTడైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో 'పుష్ప' అనే హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
'పుష్ప' సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుందని టాక్ నడుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ కి చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని చిత్ర బృందం సంప్రదించారట. ప్రస్తుతం హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సాయి పల్లవి ఇప్పుడు హీరోకు చెల్లెలిగా నటించడానికి ఒప్పుకుంటుందా అనేది చూడాలి. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే మాత్రం 'పుష్ప' చిత్రానికి మరో అదనపు ఆకర్షణ వచ్చి చేరినట్లే అని చెప్పవచ్చు. దీనిపై స్పష్టత రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా, కెరీర్ స్టార్టింగ్ నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న సాయి పల్లవి.. ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి 'లవ్ స్టోరీ'.. రానా సరసన 'విరాటపర్వం' చిత్రాల్లో నటిస్తోంది.