Begin typing your search above and press return to search.

కల్యాణ్ పై నట్టి కౌంటర్ ‘ఎటాక్’

By:  Tupaki Desk   |   26 Aug 2016 3:11 PM IST
కల్యాణ్ పై నట్టి కౌంటర్ ‘ఎటాక్’
X
టాలీవుడ్ లో ఎప్పుడూ లేని ఒక చిత్రమైన సన్నివేశం కనిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ నయింకు టాలీవుడ్ లో పలువురికి సంబంధాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత నట్టికుమార్ మీద మరో నిర్మాత సి.కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. ఎక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ విరుచుకుపడిన కల్యాణ్ పై తాజాగా నట్టికుమార్ స్పందించారు. ఒక ఛానల్ లో మాట్లాడిన నట్టికుమార్ సి. కల్యాణ్ మీద కౌంటర్ ఎటాక్ తరహాలో పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేశారు. వీటిల్లో కొన్ని వ్యక్తిగత ఆరోపణలు కూడా ఉండటం గమనార్హం.

కల్యాణ్ ది చిల్లర బతుకని.. అతడి గురించి అందరికి తెలుసన్నారు నట్టికుమార్. భార్యను చంపిన కేసు ఎవరి మీద ఉందన్నది అందరికి తెలుసన్న ఆయన.. తనపై భౌతికదాడులకు దిగుతానని బెదిరిస్తున్నారని.. ఈ వ్యాఖ్యలు చాలని ఎవరికి మందిమార్బలం ఉందో అర్థమవుతుందన్నారు. భౌతికదాడులతో తనను చంపాలని అనుకుంటే తాను చనిపోవటానికి సిద్ధమేనన్న నట్టికుమార్.. హీరోయిన్లను ఎవరు ఇబ్బంది పెట్టారో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు. పలు కేసుల మీద జైలుకు వచ్చిన కల్యాణ్ మాటలు చెప్పటం ఏమిటని ప్రశ్నించిన నట్టికుమార్.. తనకు ప్రత్యేకమైన సెక్యురిటీ అక్కర్లేదన్నారు.

తనపై భౌతికదాడులకు దిగుతానని కల్యాణ్ చెప్పినంతనే తాను ప్రభుత్వాన్ని రక్షణ కోరనని.. జరిగేది జరుగుతుందని.. తాను దేనికైనా సిద్ధమేనన్నారు. ఇలా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు.. ప్రతి వ్యాఖ్యలు చేసుకోవటం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ హాట్ గా మారింది.