Begin typing your search above and press return to search.

వీడియో: పార్టీ డ్రెస్ లో నేష‌న‌ల్ క్ర‌ష్‌ ప‌డ‌రాని పాట్లు!

By:  Tupaki Desk   |   28 May 2022 12:30 AM GMT
వీడియో: పార్టీ డ్రెస్ లో నేష‌న‌ల్ క్ర‌ష్‌ ప‌డ‌రాని పాట్లు!
X
నేష‌న‌ల్ క్ర‌ష్ గా ర‌ష్మిక మంద‌న యువ‌త‌రం గుండెల్లో గిలిగింత‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఉత్త‌రాది యూత్ ఇప్పుడు పుష్ప హీరోయిన్ ని అమితంగా ఆరాధిస్తున్నారు. ఉత్త‌ర భార‌త‌దేశంలో 'పుష్ప- ది రైజ్' సంచ‌ల‌న విజ‌యం సాధించడంతో.. ఆ ఒక్క సినిమాతోనే ర‌ష్మిక‌కు పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ద‌క్కింది. కెరీర్ లో కేవ‌లం ఐదారేళ్ల‌లోనే అసాధార‌ణ స్టార్ డ‌మ్ ఛేజిక్కించుకున్న ఏకైక ద‌క్షిణాది నాయిక‌గా ర‌ష్మిక పేరు మార్మోగుతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి దేశ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

ఇంత‌లోనే ర‌ష్మిక మంద‌న బాలీవుడ్ కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది. అక్క‌డ యువ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా తో క‌లిసి ఓ క్రేజీ దేశ‌భ‌క్తి చిత్రంలో న‌టించేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అదే స‌మ‌యంలో అమితాబ్ తో క‌లిసి న‌టించేస్తూ మ‌రో లెవ‌ల్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా ర‌ణ‌బీర్ తో యానిమ‌ల్ మూవీలో ఆఫ‌ర్ ద‌క్కించుకుంది.

అందుకే మొన్న‌టికి మొన్న క‌ర‌ణ్ జోహార్ పార్టీకి ర‌ష్మిక మంద‌న హాజ‌ర‌వుతోంద‌ని తెలియ‌గానే ఫ్యాన్స్ క‌ళ్ల‌న్నీ త‌న‌పైనే నిలిచాయి. ఇక క‌ర‌ణ్ పార్టీలో ఊహించ‌ని రీతిలో స‌రికొత్త లుక్ తో ర‌ష్మిక ప్ర‌త్య‌క్ష‌మైంది. అయితే ర‌ష్మిక ఎంపిక చేసుకున్న ఆ డిజైన‌ర్ థై స్లిట్ డ్రెస్ త‌న‌ని ఎంత‌గానో ఇబ్బంది పెట్ట‌డం అక్క‌డ స్ప‌ష్ఠంగా క‌నిపించింది. డ్రెస్ అయితే ధ‌రించింది కానీ అంత సౌక‌ర్యం అందులో క‌నిపించ‌లేదు. ర‌ష్మిక అలా వేదిక‌పై కి వ‌చ్చి ఫోటోగ్రాఫ‌ర్ల‌కు న‌వ్వుతూ ఫోజులిచ్చినా ఏదో అన్ కంఫ‌ర్ట్ త‌న ముఖంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అలాగే హైహీల్స్ తో న‌డిచి వెళుతుంటే త‌న డ్రెస్ ను చేత్తో ప‌ట్టుకుని న‌డ‌వాల్సొచ్చిందంటే ఆ డిజైన‌ర్ డ్రెస్ లో ర‌ష్మిక ప‌డ‌రాని పాట్లు ప‌డింద‌ని అర్థ‌మైంది. నియాన్ కాంతుల వెలుగు జిలుగుల్లో ర‌ష్మిక ఆర్టిఫిషియ‌ల్ న‌వ్వులు కూడా బ‌య‌టప‌డ్డాయ్!

పార్టీ డ్రెస్ లో అసౌక‌ర్యంతో ఇబ్బందిప‌డ్డ ర‌ష్మిక‌ను గ‌మ‌నించిన నెటిజ‌నులు ఈ వీడియోపై ర‌క‌ర‌కాల కామెంట్లు గుప్పిస్తున్నారు. నేష‌న‌ల్ క్ర‌ష్ ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయింది అంటూ కొంద‌రు.. పాపం పార్టీ డ్రెస్ కి అల‌వాటు ప‌డ‌లేక‌పోతోంది! అంటూ ఇంకొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఇలా అయితే బాలీవుడ్ లో రాణించ‌డం క‌ష్టం.. నైట్ పార్టీల్లో పార్టీ క్రౌడ్ లో క‌ల‌వాల్సి ఉంటుంద‌ని టాలీవుడ్ నుంచి ఫ్యాన్స్ ర‌ష్మిక‌కు సూచ‌న‌లు చేస్తున్నారు. ఇది ఆరంభం మాత్ర‌మే .. ఇంకా చాలా ఉంది! అని కూడా స‌ల‌హాలిచ్చేస్తున్నారు. ఇక ర‌ష్మిక‌పై ఫోటోగ్రాఫ‌ర్లు మ‌రీ అలా జూమ్ చేస్తుంటే అస‌లెందుకిలా జూమ్ చేస్తున్నారు? అంత అవ‌స‌రం ఏం వచ్చింది? అంటూ ఒక అభిమాని ప్ర‌శ్నించారు. ఓవ‌రాల్ గా ర‌ష్మిక ఆన్ లైన్ డిబేట్ లో సంద‌డి చేసింది.

కర‌ణ్ తో కాఫీ తాగే ఛాన్స్

కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో అందాల క‌థానాయిక ర‌ష్మిక మంద‌న‌కు కూడా ఛాన్స్ ద‌క్కింది. త‌దుప‌రి కొత్త సీజన్ మొద‌ల‌వుతోంది. బాలీవుడ్ నుంచి బ‌డా స్టార్లు ఈ కార్యక్రమంలో కనిపించనున్నారు. మొదటి ఎపిసోడ్ లో బాలీవుడ్ నుండి న‌వ‌దంప‌తులు అలియా భ‌ట్- రణబీర్ కపూర్ లు పాల్గొంటారు. ఆ త‌ర్వాత రష్మిక కూడా ఈ షోలో అరంగేట్రం చేస్తుంది.

టాలీవుడ్ లో ఛ‌లో- గీత గోవిందం చిత్రాల‌తో హిట్లు అందుకుని వ‌రుస‌గా పాన్ ఇండియా స్టార్ల‌తో న‌టించేస్తోంది. ఇప్ప‌టికిప్పుడు బాలీవుడ్ క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. పాపుల‌ర్ వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీల‌తో మంత‌నాలు సాగిస్తోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ముంబైలో ఇల్లు కొనుక్కుని సెటిలైన ఈ బ్యూటీ మునుముందు కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో క‌నిపించాక మ‌రింత హాట్ ఫేవ‌రెట్ గా మారిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.